శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 31, 2020 , 01:36:26

ఆపత్కాలంలోనూ అన్నదాతకు అండ

ఆపత్కాలంలోనూ  అన్నదాతకు అండ

  • చొప్పదండి ఎమ్మెల్యే  రవిశంకర్‌

చొప్పదండి: కరోనాతో అందరి జీవితాలు అతలాకుతలమవుతున్న ప్రస్తుత ఆపత్కాలంలోనూ కేసీఆర్‌ సర్కారు అన్నదాతకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. యాసంగిలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడమే కాకుండా రైతుబంధు నగదును సకాలంలో అందించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. చొప్పదండి పట్టణంలో విజయనగరంరెడ్డి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రైతులను కష్టాల నుంచి గట్టేక్కించేందుకు ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. నిరంతరం ప్రజల మేలు కోసం తపిస్తున్న కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్‌, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, వైస్‌ చైర్మన్‌ ముద్దం మల్లేశం, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ భూమారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇప్పన పల్లి విజయలక్ష్మి, కోఆప్షన్‌ సభ్యుడు పాషా, విజయనగరం రెడ్డి సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, నేతలు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, గుర్రం భూంరెడ్డి,  మల్లారెడ్డి, లోక రాజేశ్వరరెడ్డి, హన్మంతరెడ్డి, మల్లేశం, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కృష్ణ మహేశ్‌, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.logo