ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 31, 2020 , 01:36:39

పట్టణాల సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళిక

పట్టణాల సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళిక

  • lమున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
  • lఏకగ్రీవంగా ఎన్నికైన కో ఆప్షన్‌ సభ్యులకు అభినందన

కోరుట్ల/మెట్‌పల్లి: పట్టణాల సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు అన్నం లావణ్య, సుజాత అధ్యక్షతన గురువారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. పార్టీలకతీతంగా    అన్ని వార్డులకు నిధులు కేటాయించామన్నారు. ఇప్పటికే అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల సుందరీకరణ పనులు పూర్తి చేశామని పే ర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజ లు సహకరించాలని, మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచించారు. అంతకుముందు కోరుట్ల సర్వసభ్య సమావేశంలో హరితహారం, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, శ్మశాన వాటికల ఆధునీకరణ, వివిధ అభివృద్ధ్ది పనులు, బిల్లుల చెల్లింపు కోసం 36 అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు ప్రవేశపెట్టగా కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే పట్టణ శివారులోని పీవీ నర్సింహారావు పశువైద్య కళాశాల సమీపంలో కోరుట్ల కోర్టు జడ్జి శ్యాంకుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, రైతు బందు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, ప్రభుత్వ న్యాయవాది కటుకం రాజేంద్ర ప్రసాద్‌, టీపీవో శ్రీనివాసరావు, మేనేజర్‌ తన్నీరు రమేశ్‌, ఆర్వో గణేశ్‌రెడ్డి, ఇంజినీర్‌ సాయి ప్రణీత్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గజానంద్‌ పాల్గొన్నారు.    

ఏకగ్రీవంగా కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాల్లో  కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియను చేపట్టారు.  కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రతిపాదించిన టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మెజారిటీ సభ్యులు చేతులెత్తి మద్దతు ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన సదబత్తుల వేణు, రెంజర్ల కల్యాణి, సయ్యద్‌ అన్వర్‌, పర్వీనా బేగం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌ ఎన్నికైన నలుగురు కో ఆప్షన్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మెట్‌పల్లి మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ఏశాల రాజశేఖర్‌, గైని లావణ్య, పన్నాల మాధవరెడ్డి, నవీన్‌ సుల్తానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులను కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు.  logo