శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 28, 2020 , 02:28:07

కోతుల బెడద నివారణకే మంకీఫుడ్‌ కోర్టులు

కోతుల బెడద నివారణకే మంకీఫుడ్‌ కోర్టులు

  • ఈజీఎస్‌ ఏపీడీ శ్రీధర్‌ 
  • గ్రామాల్లో మంకీఫుడ్‌ కోర్టుల పరిశీలన

శంకరపట్నం: గ్రామాల్లో కోతుల బెడదతో అనేక సమస్యలు వస్తున్నాయని, దీనిని నివారించేందుకే ప్రభుత్వం మంకీఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నదని ఈజీఎస్‌ ఏపీడీ శ్రీధర్‌ పేర్కొన్నారు. మక్త గ్రామంలోని గుర్జాల గుట్ట దిగువన ఏర్పాటు చేస్తున్న మంకీఫుడ్‌ కోర్టును సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ఆహారం దొరకకపోవడంతోనే అడవులు, కొండ ప్రాంతాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు మంకీఫుడ్‌ కోర్టుల ద్వారా వాటికి ఆహారం అందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పండ్ల మొక్కలను విస్తృతంగా నాటుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక శ్రద్ధతో పండ్ల మొక్కలను సంరక్షించాలని పంచాయతీ పాలకవర్గాన్ని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నెలవేని సుష్మ, ఉప సర్పంచ్‌ గాజుల రజిత, ఏపీవో శారద, పంచాయతీ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు. 

హరిత లక్ష్యం చేరుకోవాలి

చిగురుమామిడి : హరితహారంలో భాగంగా నిర్దేశించిన మేర మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకోవాలని ఏపీడీ  శ్రీధర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పెద్దగుట్ట వద్ద మంకీఫుడ్‌ కోర్టులో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్‌తో కలిసి మొక్కలు నాటారు. కోతుల బెడదను నివారించేందుకు మంకీఫుడ్‌ కోర్టుల్లో పండ్ల మొక్కలు పెంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఖాజా మొయినొద్దీన్‌, తహసీల్దార్‌ ముబిన్‌ అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు లక్ష్మణ్‌, పీచు లీల, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ సర్వర్‌పాషా, పంచాయతీ కార్యదర్శులు హిదయతుల్లా, శ్రీకాంత్‌, ఇన్‌చార్జి ఏపీవో రాజయ్య పాల్గొన్నారు. 


logo