ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 26, 2020 , 02:02:05

అన్నదాతల సంక్షేమమే సర్కారు ధ్యేయం

 అన్నదాతల సంక్షేమమే సర్కారు ధ్యేయం

  •  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • n రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన

 చొప్పదండి: అన్నదాతల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే కల్లాలు, రైతు వేదికల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని చొప్పదండి, గుమ్లాపూర్‌, వెదురుగట్ట గ్రామాల్లో రైతువేదిక భవన నిర్మాణాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావడానికే ప్రభుత్వం రైతువేదికల నిర్మాణం చేపడుతున్నదని తెలిపారు. ఇక రైతులంతా ఒకచోట కూర్చొని పంటల సాగుపై చర్చించుకోవచ్చన్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతుబంధు డబ్బులు ఇచ్చి అన్నదాతలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. గోదావరి, కాళేశ్వరం జలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి,  సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, తిరుపతిరావు, సర్పంచులు సౌజన్య, వెల్మ నాగిరెడ్డి, ఎంపీటీసీలు వెల్మ విజయలక్ష్మి, బత్తుల లక్ష్మీనారాయణ,  మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం చుక్కారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, మాచర్ల వినయ్‌, ఎడవెల్లి జనార్దన్‌, మావురం మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.logo