గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jul 26, 2020 , 02:02:05

ఆరేండ్లలోనే 65ఏండ్ల ప్రగతి

ఆరేండ్లలోనే 65ఏండ్ల ప్రగతి

  • n రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • n  గొల్లపల్లి, పెగడపల్లి మార్కెట్‌ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు

గొల్లపల్లి/పెగడపల్లి: ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏండ్ల పాలనలో జరుగని అభివృద్ధి.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవతో ఆరేండ్లలోనే సాధ్యమైందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పునరుద్ఘాటించారు. శనివారం గొల్లపల్లి, పెగడపల్లి మండల కేం ద్రాల్లో జరిగిన వ్యవసాయ మార్కెట్‌ కమి టీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడా రు. రైతుల క్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సేద్యానికి శ్రీకారం చుట్టగా, రైతుల్లో చక్కని స్పందన కనిపించిందని, ప్రభుత్వం చెప్పిన పంటలే వేశారని చెప్పారు.  24 గంటల కరెంట్‌, ప్రాజెక్టుల నిర్మాణంతో జిల్లాలో లక్షకు పైచిలుకు ధాన్యం అధికంగా పండిందన్నారు. స్వరాష్ట్రంలో ఆరేళ్లకాలంలో యూరియా కోసం అన్నదాతలు ఏనాడూ ఇబ్బందిపడలేదని పేర్కొన్నారు. రైతాంగం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుబంధు, రైతు బీమా లాంటి వినూత్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మూతబడ్డ సహకార సంఘాలకు పునరుజ్జీవం పోశామని చెప్పారు. రాను న్న రోజుల్లో  రైతుల వద్ద మాత్రమే డబ్బు లు ఉండే పరిస్థితి వస్తుందని చెప్పారు.

ప్రతిపక్షాలకు కడుపు మంట 

మండుటెండల్లో అలుగులు దూకుతున్న చెరువులను చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతున్నదని విమర్శించారు. 65 ఏళ్లు అధికారంలో ఉండి  వెలగబెట్టిందేమీ లేదని, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల పాలనలో కనీసం 6 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నదని, ఆ కార్యక్రమం ప్రారంభం కాగానే ప్రతిపక్షాల దుకాణాలు మూతబడడం ఖాయమని ఎద్దేవా చేశారు. పెగడపల్లిలో 49 మంది లబ్ధిదారులకు రూ.15లక్షల  విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించారు. 

సంతోషంగా ఉంది.. 

రైతు ముస్కు లింగారెడ్డికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి దక్కడం సంతోషంగా ఉందన్న మంత్రి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతులు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు. పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. చైర్మన్‌గా లింగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా బోయపోతు గంగాధర్‌ (ఇబ్రహీంనగర్‌), డైరెక్టర్లుగా బీసవేసి నాగరూప (తిర్మలాపూర్‌ పీడీ), సింగిరెడ్డి జలంధర్‌రెడ్డి (రాఘవపట్నం), కడమండ వెంకటి (తిర్మలాపూర్‌ ఎం), రంగు మోహన్‌ (గుంజపడుగు), కాల్వ చిన్నరాజయ్య (గోవింద్‌పల్లి), బత్తిని సత్యనారాయణ గౌడ్‌ (రాపల్లి), చాడ సత్తయ్య (గొల్లపల్లి), చాడ వెంకటరమణ (గొల్లపల్లి)ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన మంత్రి ఈశ్వర్‌కు లింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

పెగడపల్లి కార్యవర్గం..

పెగడపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన చైర్మన్‌గా నగావత్‌ తిరుపతినాయక్‌, వైస్‌ చైర్మన్‌గా తిర్మణి రమణారెడ్డితో పాటు, డైరెక్టర్లుగా రాచూరి పద్మ, ఇరుగురాల అజయ్‌, పులి రాజేశం, గురిజల జలపతి, గోలి సంజీవరెడ్డి, నెత్తట్ల రాజేశం, పెద్ది రమేశ్‌, ట్రేడర్‌ నుంచి వెల్మ సత్యనారాణరెడ్డి, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నందగిరి సింగిల్‌ విండో చైర్మన్‌ కర్ర భాస్కర్‌రెడ్డి, పెగడపల్లి సర్పంచ్‌ మేర్గు శ్రీనివాస్‌, ధర్మపురి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు చిలుముల రాంచందర్‌ మంత్రి ఈశ్వర్‌,  జిల్లా మార్కెట్‌ అధికారి డీ ప్రకాశ్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో గొల్లపల్లిలో ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ గోస్కుల జలంధర్‌, విండో అధ్యక్షుడు డాక్టర్‌ రాజసమన్‌రావు, వెంకట మాధవరావు, ఉపాధ్యక్షుడు సత్తయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రమేశ్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు సలీం, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంగారెడ్డి, సర్పంచ్‌ ముస్కు నిషాంత్‌రెడ్డి, పెగడపల్లిలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత వోరుగంటి రమణారావు, ఎంపీపీలు గోలి శోభసురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్లు మంత్రి వేణుగోపాల్‌, బలరాంరెడ్డి, ధర్మపురి, వెల్గటూర్‌ ఏఎంసీ చైర్మన్లు మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, కో-ఆప్షన్‌ సభ్యుడు రహీం, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న ఉన్నారు.  logo