శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 20, 2020 , 02:35:35

జగిత్యాల అభివృద్ధికి కృషి

జగిత్యాల అభివృద్ధికి కృషి

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల పట్టణ అభివృద్దితోపాటు పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ను పక్కాగా అమలుకు కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ కొత్తకొండ వజ్రమ్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అంజయ్య గౌడ్‌తోపాటు సుమారు వందమంది ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ పట్టణ ప్రణాళిక, హరితహా రం, వార్డుల శుభ్రత,రోడ్డు వెడల్పు వంటి కార్యక్రమాల తోపాటు అభివృద్ధిలో కీలకమైన మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు కృషి చేస్తామన్నారు. గౌడ కులస్థు లు ఆత్మగౌరవంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గౌడ కులస్థుల కోసం నీరా స్టాళ్లను హైదరాబాద్‌లో ఏ ర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు బొడ్ల జగదీశ్వర్‌, కప్పల శ్రీకాంత్‌, ఒద్ది శ్రీలతారామ్మోహన్‌, పద్మావతి, గుగ్గుళ్ల హరీశ్‌, లావణ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దేశాయి, టీఆర్‌ఎస్‌ నాయకులు బండారు నరేందర్‌, దావ సురేశ్‌, సతీశ్‌రాజ్‌, బాలె శంకర్‌, ఆనందరావు, మల్లేశం, సుమన్‌రావు, ప్రణయ్‌, ముఖేశ్‌ ఖన్నా ఉన్నారు. logo