బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 16, 2020 , 02:38:12

కాళేశ్వరం నిర్మించి కరువును తరిమికొట్టాం

కాళేశ్వరం నిర్మించి కరువును తరిమికొట్టాం

  •  బతుకమ్మ పండుగ నాటికి ప్రతి చెరువునూ నింపుతాం
  •  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
  •  పలు గ్రామాల్లో రైతు వేదికలు,  వారసంతల నిర్మాణానికి  శంకుస్థాపన 

గన్నేరువరం/తిమ్మాపూర్‌ రూరల్‌: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కరువును తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌ సర్కారుకే దక్కిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. రైతాంగానికి మేలు చేసేందుకే అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బుధవారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, మాదాపూర్‌, గన్నేరువరం, ఖాసీంపేట, తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే జంగపెల్లి, గన్నేరువరం గ్రామాల్లో వారసంతలు,  మాదాపూర్‌లో కల్లాల నిర్మాణ పనులను ప్రారంభించారు. మైలారంలో డీ-8 ఉప కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన 78 మంది నిర్వాసితులకు చెక్కులు అందజేశారు. గుండ్లపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటికి ప్రతి చెరువునూ నింపుతామన్నారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 60లక్షల కోట్లను వ్యవసాయరంగానికి కేటాయించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. 61 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ న్యాత స్వప్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, కో ఆర్డినేటర్‌ మాధవరెడ్డి, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో నర్సింహారెడ్డి, ఆర్‌ఐ రజనీకర్‌, ఏవో కిరణ్మయి, ఏఈవోలు అనూష, సౌమ్య, నరేశ్‌, ప్రశాంత్‌, ఎస్‌ఐ తిరుపతి, సర్పంచులు సమత, జ్యోతి, రేఖ, శారద, లక్ష్మి, మల్లీశ్వరి, రేణుక, చంద్రారెడ్డి, సంపత్‌, మల్లయ్య, మధుకర్‌, ఎంపీటీసీలు స్వప్న, ఆంజనేయులు, కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ రఫీ, నేతలు సుధాకర్‌, లక్ష్మణ్‌, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, వెంకన్న. చంద్రారెడ్డి, కోటేశ్వర్‌, మల్లేశం, రవి, బాల్‌రాజు, కొమురయ్య, వెంకటేశ్వర్లు, సురేశ్‌, రవి, రాజేశం, ఏ మల్లేశం, వీ సత్యనారాయణరెడ్డి, జీ తిరుపతిరెడ్డి, స్వామి, శ్రీనివాస్‌, కిషన్‌రెడ్డి ఉన్నారు. తిమ్మాపూర్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత మాదాడి రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌ భారతి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్‌రెడ్డి, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, నాయకులు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, దావ రాజు తదితరులు పాల్గొన్నారు.


logo