గురువారం 13 ఆగస్టు 2020
Jagityal - Jul 15, 2020 , 02:26:16

వైకుంఠధామాలు పూర్తి చేయాలి

వైకుంఠధామాలు పూర్తి చేయాలి

  • జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌

కొత్తపల్లి: వైకుంఠదామాలు, వర్మీకంపోస్ట్‌ షెడ్ల నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఆసిఫ్‌నగర్‌(బావుపేట), నాగులమల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, వర్మీకంపోస్ట్‌ షెడ్లు, మంకీఫుడ్‌ కోర్టులు, పల్లె ప్రకృతి వనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆసిఫ్‌నగర్‌లో  చెత్తాచెదారం పేరుకుపోవడంతో డీపీవో పంచాయతీ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులమల్యాలలో పూర్తయిన వైకుంఠధామం, వర్మీకంపోస్ట్‌ షెడ్లను చూసి అక్కడి అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైకుంఠధామాలు, వర్మీకంపోస్ట్‌ షెడ్ల నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వానకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇక్కడ ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచులు జినుక సంపత్‌, నాయిని ప్రసాద్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 


logo