మంగళవారం 11 ఆగస్టు 2020
Jagityal - Jul 13, 2020 , 01:47:03

అమాత్యుడి ఆపన్నహస్తం

అమాత్యుడి ఆపన్నహస్తం

ధర్మపురి: జగిత్యాల జిల్లా వెల్గటూర్‌కు చెందిన ఓ విద్యార్థికి రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ ఆపన్నహస్తం అందించారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి యువకుడితో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పూర్తిగా కోలుకునే దాకా చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. వెల్గటూర్‌కు చెందిన గాడిపెల్లి సాయిరాం కరీంనగర్‌లోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం వైద్యులను సంప్రదించగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని చెప్పారు. సాయిరాం తండ్రి రాజయ్య చాలాకాలం కిత్రం మృతి చెందగా..తల్లి వెంకటవ్వ కూలీ పనిచేస్తూ బతుకుబండి నెట్టుకొస్తున్నది. సాయిరాం చికిత్సకు వేలల్లో ఖర్చవుతుందని తెల్సి వారు తల్లడిల్లారు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలసుకున్న మంత్రి ఆదివారం ఎంపీటీసీ పెద్దూరి హారిక-భరత్‌ను సాయిరాం ఇంటికి పంపి సాయిరాంతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునేదాకా చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఇంజినీరింగ్‌  పూర్తి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సాయిరాం కుటుంబసభ్యులు మంత్రి ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వెల్గటూర్‌ జడ్పీటీసీ సుధారాణి-రామస్వామి రూ.5వేలు, ఎంపీటీసీ హారికభరత్‌ రూ.5వేలను సాయిరాంకు చికిత్స కోసం అందజేశారు.logo