బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 12, 2020 , 01:30:48

రైతే రాజు నినాదాన్ని సాకారం చేశాం

రైతే రాజు నినాదాన్ని సాకారం చేశాం

  • lసీఎం కేసీఆర్‌ విధానాలతో అన్నపూర్ణగా తెలంగాణ 
  • lరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 
  • lరైతే నేటి పాలకుడు : మంత్రి గంగుల 
  • lరూ.1.90 కోట్లతో వ్యవసాయ పరిశోధనా కేంద్ర భవనం ప్రారంభం 
  • lరేణికుంట, వెలిచాలలో రైతు వేదికలకు శంకుస్థాపన

కొత్తపల్లి/ రామడుగు/ తిమ్మాపూర్‌రూరల్‌ : ఏడు దశాబ్దాలుగా రాజకీయ నినాదంగా ఉన్న ‘రైతే రాజు’ కలను సీఎం కేసీఆర్‌ సారథ్యంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సాకారం చేశామని రాష్ట్ర వ్యవసా య, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విధానాలతో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మనమే మూలం కావడం గర్వకారణంగా ఉందని ఉద్ఘాటించారు. ఈ మేర కు శనివారం కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన, కరీంనగర్‌ పరిధిలోని పద్మనగర్‌లో రూ.కోటి 90 లక్షలతో నిర్మించిన వ్యవసాయ పరిశోధనా కేంద్ర భవన సముదాయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. తిమ్మాపూర్‌ మండలం రేణికుంట, రామడుగు మండ లం వెలిచాలలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి ఆయాచోట్ల మాట్లాడారు. అత్యుత్తమ మక్కజొ న్న వంగడాలను ఉత్పత్తి చేసి దేశ విత్తనోత్పత్తి రంగంలో కరీంనగర్‌ వ్యవసాయ పరిశోధనా కేం ద్రాన్ని ముందు వరుసలో ఉంచాలని శాస్త్రవేత్తల కు, అధికారులకు సూచించారు. 1950లోనే వ్య వసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటైనప్పటికీ ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందలేదని, 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో అత్యాధునిక ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇక్కడ భిన్నమైన హైబ్రీడ్‌ వంగడాలను తయారు చేస్తున్నప్పటికీ ఈ కేం ద్రంలో మక్కజొన్న పరిశోధనకు మరింత ఎక్కు వ అవకాశం ఉండడంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నియంత్రిత సాగు విధానంతో మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ రాబోతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ మార్కెటింగ్‌ అనాలసిస్‌, రీసెర్చ్‌, ఇంటలిజెన్స్‌ సమన్వయంతో శాస్త్రవేత్తలతో కలిసి ప్రత్యేక కమిటీని వేయబోతున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఏ పని చేసినా కరీంనగర్‌ నుంచే ప్రారంభిస్తారని, అందుకే తెలంగాణ అంతటికీ కరీంనగర్‌ అంటే ప్రత్యేక భావోద్వేగమన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి విన్నవిస్తున్నప్పటికీ పెడచెవిన పెడుతోందని, భవిష్యత్‌లో రైతుల దీవెనలుంటే సీఎం కేసీఆరే దానిని అమలు చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తొవ్వ చూపిందని, ఇక్కడి రైతులకున్న పరిజ్ఞానం చాలా గొప్పదని, ఎక్కువ మెళకువలు తెలిసి ఉంటారని కొనియాడారు. తాను దారివెంట వస్తుంటే దక్షిణం కంటే ఉత్తర తెలంగాణ మడికట్లలో ఎక్కువ పనులు జరగడం కనిపించిందన్నారు. వెలిచాల గ్రామ పంచాయతీని చూస్తే ఆశ్చర్యం వేసిందని, తనకు కడుపు నిండినంత ఆనందంగా ఉందని, పంచాయతీ కార్యాలయం, నిర్వహణ, పరిసరాలు ఊరు బాగుపడాలన్న తలంపునకు నాందిగా నిలిచాయన్నారు. రైతులను సంఘటితం చేసి, ఆర్థికాభివృద్ధి వైపు మళ్లించడానికే రైతు వేదికలని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నీళ్లు వస్తున్నాయని, పెట్టుబడికి సహాయం అందుతుందని, మార్కెట్‌కు అనుగుణంగా పంటలను పండించడానికి, మార్కెటింగ్‌ చేసేందుకు ఈ వేదికల ద్వారా అధికారులు సూచనలు, సలహాలు అందిస్తారన్నారు.


logo