గురువారం 24 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 11, 2020 , 01:40:17

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మారుతీనగర్‌: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో రూ.22.50లక్షలతో చేపట్టిన రైతు వేదిక, రూ.9.50లక్షలతో చేపట్టిన కల్యాణ మండప నిర్మాణాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు వేదికల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. సాగులో మెళకువలు, తెగుళ్ల నివారణ చర్యల గురించి వేదికల్లో వ్యవసాయాధికారులు రైతులకు వివరిస్తారని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి మొక్కలు నాటారు.  అంతకుముందు శివాలయంలో ప్రత్యేకపూజలు చేశా రు. మంకీ ఫుడ్‌కోర్టులో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్‌ గడ్డం లింగారెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, మెట్‌పల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, ఎంపీటీసీ కనుక సాయమ్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం మహేశ్‌రెడ్డి, ఏలేటి రాజేందర్‌రెడ్డి, అల్లూరి పెద్దరాజేశ్వర్‌రెడ్డి, వెల్మ శేఖర్‌, ఏవో షాహిద్‌ అలీ, పంచాయతీ కార్యదర్శి శ్రీలేఖ, కారోబార్‌ రాములు, అంగన్‌వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  

పని చేయకుంటే కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి 

పని చేయకుంటే కాంట్రాక్టును రద్దు చేసి ఇతర కాంట్రాక్టర్లకు పనిని అప్పగించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆర్‌అండ్‌బీ ఏఈ భూమయ్యకు సూచించారు. మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామ సమీపంలోని వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను సంబంధిత కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా నిలిపివేశాడని గ్రామస్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తెలుపగా ఆయన స్పందించారు. వంతెన పనులు నిలిపివేసిన సదరు కాంట్రాక్టర్‌ను తొలగించి మరొకరికి పనులను అప్పగించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. 


logo