ఎగువ రైతుల ఆనంద హేల

మేడిపల్లి/కథలాపూర్: ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాలువ ఎగువ గ్రామాలకు లిఫ్ట్ ద్వారా నీరందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కథలాపూర్, మేడిపల్లి మండలాల కర్షకుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. శుక్రవారం కథలాపూర్ మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని కొనియాడారు. అలాగే మేడిపల్లి మండలంలోని భీమారం గ్రామంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దోనకంటి, స్థానిక రైతులతో కలిసి సీఎం కేసీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, ఎంపీపీ జవ్వాజి రేవతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కేతిరెడ్డి మహిపాల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దొంతి శ్రీనివాస్, సర్పంచ్‌లు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, వంగ వెంకటేశం, గడ్డం నారాయణరెడ్డి, చెక్కపెల్లి అరుణ, దుంపేట లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీలు చెన్నమనేని రవీందర్రావు, మకిలీ దాస్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ మిట్టపెల్లి భూమారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం విజయసాగర్, నాయకులు వర్ధినేని నాగేశ్వర్రావు, గడ్డం భూమరెడ్డి, ఎం డీ రఫీ, ఎం జీ రెడ్డి, గసికంటి వేణు, నాంపెల్లి లింబాద్రి, చెల్లపెల్లి అంజయ్య, మల్యాల రమేశ్, వేముల గంగరాజం, నల్ల గంగాధర్, గజ్జెల స్వామి, బాదినేని రమేశ్, దోనకంటి రాజరత్నాకర్రావు, నె ల్లుట్ల ప్రభాకర్, నాంచారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం
- బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి
- లంగావోణిలో సాయిపల్లవి న్యూ లుక్ కు 'ఫిదా'
- జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..
- జగ్గారెడ్డిపై నల్లగొండ టీఆర్ఎస్వీ నాయకుల ఫిర్యాదు
- ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో!?
- రైల్వే పనులు వేగంగా చేపట్టాలి : మంత్రి హరీశ్‌రావు
- ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
- పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన తేరా చిన్నపరెడ్డి
- ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి