ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 10, 2020 , 02:35:01

పథకాలను చూసే పార్టీలోకి

పథకాలను చూసే పార్టీలోకి

  •  ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాలకు చెందిన స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, ఆకోజు కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులు పార్టీలో గురువారం చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ, కులమతాలనే తేడా లేకుండా ముఖ్యమంత్రి ప్రతి ఒక్క సంఘం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, జిల్లా యూత్‌ అధ్యక్షుడు దావ సురేశ్‌, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు గంగమల్లు, పట్టణ యూత్‌ అధ్యక్షుడు కత్రోజు గిరి, రాష్ట్ర ఒడ్డెర సంఘం అధ్యక్షుడు మొగిలి, నాయకులు బోగ ప్రవీణ్‌, డిష్‌ జగన్‌, సుమన్‌ రావు, కట్ట వినోద్‌, అరుణ్‌, సంజీవ్‌, మణిచందర్‌, పొలాస ప్రవీణ్‌, కడార్ల నాగార్జున, వడ్లూరి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. logo