మంగళవారం 04 ఆగస్టు 2020
Jagityal - Jul 06, 2020 , 01:19:02

నియంత్రిత సాగుతో లాభాలు

నియంత్రిత సాగుతో లాభాలు

జగిత్యాల/జగిత్యాల రూరల్‌: నియంత్రిత సాగుతో రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల మండలం చల్‌గల్‌ గ్రామంలో ఆదివారం నిర్వహించిన హరితహారంలో భాగం గా ఆయన జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా వీలైనన్ని మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ.. జిల్లాకు నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగారాంగౌడ్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌రావు, జిల్లా, రైతు బంధు సమితి జిల్లా, మండల సభ్యులు బాల ముకుందం, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, సర్పంచులు ఎల్లా గంగనర్సు, రాజన్న, నారాయణ, గంగాధర్‌, గంగారాం, రత్నమాల, శంకర్‌, ఉప సర్పంచ్‌ పద్మ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, సత్యం, గంగారాం, దిలీప్‌, శ్రీను, దిలీప్‌, తహసీల్దార్‌ దిలీప్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

నిరుపేదల కోసమే సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలు అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స కోసం ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం అందజేస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జగిత్యాల పట్టణంలోని 45 మందికి రూ.12.55 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి చెక్కులు ఇంత పెద్ద మొత్తంలో ఇదివరకు ఎన్నడూ అందజేయలేదన్నారు. వైద్యం కోసం ఆర్థికంగా నష్టపోయిన వారికి కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి కింద ప్రభుత్వం సా యం అందజేస్తుందన్నారు. ఇంత మంచి కార్యక్రమం కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పక్షాలు కరోనా మీద రాజకీయం చేస్తున్నాయని, వీలైతే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని హితవు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పంబాల రాము, నాయకులు సమిండ్ల శ్రీనివాస్‌, సతీశ్‌రాజ్‌ తదితరులున్నారు. 

జడ్పీ అధ్యక్షురాలికి అభినందనలు

జగిత్యాల: పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత-సురేశ్‌ దంపతులకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రజలకు మరింత చేరవై సేవలందించాలని వసంతకు సూచించారు. logo