శుక్రవారం 07 ఆగస్టు 2020
Jagityal - Jul 06, 2020 , 01:11:29

కరువు తీర్చిన ఘనత కేసీఆర్‌దే

కరువు తీర్చిన ఘనత కేసీఆర్‌దే

 గన్నేరువరం : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాళేశ్వర జలాలను తీసుకువచ్చి కరువు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. ఈదులకుంట చెరువు కాళేశ్వర జలాలతో పూర్తిగా నిండి మత్తడి దూకుతుండడంతో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, మాట్లాడారు. మానకొండూర్‌ నియోజకవర్గంలోని గన్నేరువరం, బెజ్జంకి మండలాల్లో గతంలో తాగడానికి నీరు దొరకనంత కరువు తాండవించేదని, రైతులు ఆరుతడి పంట లు కూడా వేసుకునే పరిస్థితి ఉండకపోయేదని, నేడు కాళేశ్వర జలాలతో ఈ మండలాల కరువు తీరిందని పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని చెరువులు కాళేశ్వర జలాలతో నిండుతుండడంతో భూగర్భ జలాలు పైకి వచ్చి బా వులు, బోర్లలో పుష్కలంగా నీరుందన్నారు. నియోజకవర్గంలోని 57 చెరువులు పూర్తిగా నింపనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఈ చెరువుల్లో ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను పెంచి ఉపాధి పొందాలని సూచించారు. అతి త్వరలోనే ఉప కాలువల నిర్మాణాలు సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఖాసింపేట లో డీ-8 నుంచి ఎల్‌-1 కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న 20 మంది రైతులతో మాట్లాడి త్వరలో తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని, కాలువ నిర్మాణానికి సహకరించాలని కోరారు.


logo