మంగళవారం 11 ఆగస్టు 2020
Jagityal - Jul 06, 2020 , 00:26:42

భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

భక్తి శ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

జగిత్యాల టౌన్‌ : జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కరోనా నేపథ్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ నిషేధించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ సాయిబాబాను దర్శించుకొన్నారు. 

కొడిమ్యాల: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో సర్పంచ్‌ ఏలేటి మమత దంపతులు పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అంకం జనార్దన్‌, రమేశ్‌, వెంకటేశ్వర్లు, మోహన్‌, ఆదిరెడ్డి, సురేశ్‌,  కిషన్‌, దేవయ్య తదితరులు ఉన్నారు. 

పెగడపల్లి: మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి, నామాపూర్‌, ఎల్లాపూర్‌, ఐతుపల్లి సీతారామచంద్రస్వామి, బతికపల్లి భక్త మార్కండేయస్వామి, మద్దులపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు.  వెంగళాయిపేట శివాంజనేయస్వామి, ఆరవల్లి సత్యనారాయణస్వామి, నంచర్ల సీతారామచంద్రస్వామి ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మారుతీనగర్‌ :  మెట్‌పల్లి పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు చేశారు. బోయవాడలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. సాయిరాం ఆలయంలో సాయినాథుడికి పల్లకీ సేవ చేశారు. వెల్లుల్ల రోడ్‌లోని వేంకటేశ్వరాలయంలో వేందపండితుడు రామానుజాచారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంపేట, చౌలమద్ది గ్రామాల్లో  యువకులు ఉపాధ్యాయులను సన్మానించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

మల్లాపూర్‌: మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్‌, అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఇటీవల నవోదయకు ఎంపికైన విద్యార్థులు అక్షయ, మనోజ్ఞ, అక్షయ్‌, ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన వివేక్‌, ఆదిత్య, చందనను వేర్వేరుగా సన్మానించారు. లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్మన్‌ శివ శ్రీనివాస్‌, అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్‌, మాజీ అధ్యక్షుడు దేవ మల్లయ్య, ఎంపీటీసీ-1 ఆకుతోట రాజేశ్‌, సభ్యులు చింతకుంట భాస్కర్‌, మార్గం రాజేశ్వర్‌, నాయకులు శివ, ప్రేమ్‌, శరత్‌, శ్రీనివాస్‌, పురుషోత్తం, సతీశ్‌, నరేశ్‌ పాల్గొన్నారు. 

కోరుట్ల : మండలంలోని జోగిన్‌పల్లిలోని శ్రీ నారాయణ మహర్షి ఆశ్రమంలో గీతాపారాయణం, భజన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దుంపల నర్సు, ఎంపీటీసీ రాజు, నాయకులు రాములు, గంగారాం, స్వామిరెడ్డి, నర్సింహులు, రాజన్న, లక్ష్మి, రాధ, ఆశ్రమ భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

కోరుట్లటౌన్‌: గురుపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని జ్ఞాన సరస్వతీ ఆలయ గౌరవాధ్యక్షుడు చిదురాల నారాయణ, ప్రధాన ఆర్చకులు పాలెపు రాముశర్మను కంఠేశ్వర సేవా సమితి సేవా సభ్యులు శాలువా, పూలమాలలతో  సత్కరించారు. ఇక్కడ సమితి సభ్యులు జితేందర్‌, ఆడెపు మధు, శ్రీనివాస్‌గౌడ్‌, నరేందర్‌, శేఖర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కథలాపూర్‌: దూలూర్‌లో సీతారాముల విగ్రహాలను పల్లకీలో భక్తులు ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీనర్సయ్య, సింగిల్‌విండో డైరెక్టర్‌ గుండారపు గంగాధర్‌, నాయకులు మేడిపెల్లి రాజారెడ్డి, మిట్టపెల్లి లచ్చన్న, ఏనుగు మహేందర్‌, వంగరి లింగేశ్వర్‌, వెగ్యారపు శ్రీహరి, క్యాతం దేవయ్య, మురళి, అర్చకుడు ఆచార్య హరిబాబు పాల్గొన్నారు. logo