ఆదివారం 09 ఆగస్టు 2020
Jagityal - Jul 05, 2020 , 02:55:28

జగిత్యాలలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

జగిత్యాలలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని బీరయ్య స్వామి ఆలయం వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 74 వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు  మల్లేశం మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆనాటి దేశ్‌ముఖ్‌, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ నియంతృత్వ పాలనను నిరసిస్తూ పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో చెట్టి కొమురయ్య, పుల్ల మహేశ్‌, చెట్టె రమేశ్‌, సాయిల్ల మురళి, బండారి మల్లేశం, పుల్ల గట్టయ్య, అంజయ్య, గట్టు రాజం, మల్యాల గంగన్న, బండారి గంగారాం, పోశాలు పాల్గొన్నారు. 

ధర్మపురి: ధమ్మన్నపేటలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్‌ గంగమల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. యాదవ సంఘం నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాదవ సంఘ భవనం ఆవరణలో మొక్కలు నాటారు. యాదవ సంఘం అధ్యక్షుడు కొమురెల్లి, నాయకులు మురళి, మల్లేశం, బుచ్చన్న, భూమన్న, భూమేశ్‌, తిరుపతి తదితరులున్నారు.


logo