బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 05, 2020 , 00:56:58

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణచౌక్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని గొల్ల, కుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సంఘ భవనంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ  కరీంనగర్‌లో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి రమేశ్‌యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్యయాదవ్‌, జిల్లా అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె శ్రీనివాస్‌యాదవ్‌, నగర అధ్యక్షుడు జంగ కొమురయ్యయాదవ్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజిగిరి నవీన్‌కుమార్‌, మునిగంటి శంకరాచారి, గాజుల కరుణాకర్‌నేత పాల్గొన్నారు.

కార్పొరేషన్‌: తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా కుర్మ సంఘ కార్యాలయంలో శనివారం సంఘం నాయకులు నిర్వహించారు.  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. సంఘం నాయకులు మీస బీరయ్య, కేదారి ఐలయ్య, కర్రె రాజు, కర్రె శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

హౌసింగ్‌బోర్డుకాలనీ:  నగరంలోని తెలంగాణ జాగృతి జిల్లా కార్యాలయంలో  జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య, వివేకానంద వర్ధంతి నిర్వహించారు. జాగృతి నియోజకవర్గ కన్వీనర్‌ అనువోజు రవికాంత్‌, నాయకులు పొన్నం రెడ్డి, అఖిల్‌, వినయ్‌, వంశీ, తదితరులు పాల్గొన్నారు.  


logo