బుధవారం 12 ఆగస్టు 2020
Jagityal - Jul 02, 2020 , 03:41:00

కుల సంఘాల అభివృద్ధే ధ్యేయం

కుల సంఘాల అభివృద్ధే ధ్యేయం

  • n ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
  • n జిల్లా కేంద్రంలో వైశ్య సంఘం భవన అభివృద్ధికి భూమిపూజ

జగిత్యాల: నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. రూ.75లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన జిల్లా కేంద్రంలోని వైశ్య సంఘ భవన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుల సంఘాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ప్రతి కుల సంఘానికీ భవనం ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మాజీ ఎంపీ కవిత చొరవతో మంత్రి కేటీఆర్ రూ.50కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల నుంచి గంజ్ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. నిజామాబాద్-కరీంనగర్ రోడ్డుకు మధ్యలో డివైడర్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. కరీంనగర్ రోడ్డులో పాల కేంద్రం పక్కన అమరవీరుల స్తూపంతో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రత విషయంలో పోలీసు శాఖకు రూ.కోటి కేటాయించామన్నారు. ఇందులో నుంచి రూ.50లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. జగిత్యాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కేక్ కట్ చేసి, వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు డాక్టర్ బోగ శ్రావణి, పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు చకినం కిషన్, గోలి శ్రీనివాస్, బొడ్ల జగదీశ్, కప్పల శ్రీకాంత్, పంబాల రాము, జీఆర్ దేశాయి, కత్రోజు గిరి, బోగ ప్రవీణ్, శేఖర్, సతీశ్‌రాజ్, మల్లేశం, విజయ్, ఆనందరావు, బండారి విజయ్, బోగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

వైద్యుల సేవలను వెల కట్టలేం

వైద్యుల సేవలను వెల కట్టలేమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా సీనియర్ సిటిజన్స్, ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు హరి అశోక్‌కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, మానాల కిషన్, బండారి విజయ్, రాజగోపాలాచారి, విజయ్‌కుమార్ గుప్తా, శేఖర్, ధనుంజయ్, కామేశ్వర్‌రావు, ప్రసాద్, నిర్మల, రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

కొండపోచమ్మ రిజర్వాయర్ పరిశీలన 

జగిత్యాల రూరల్: కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బుధవారం సందర్శించారు. రిజర్వాయర్ ప్రత్యేకత, సామర్థ్యాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నదని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలంటూ రాజకీయం చేస్తున్నాయని సంజయ్‌కుమార్ ఆరోపించారు. 


logo