మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 02, 2020 , 03:41:01

మౌలిక వసతుల కల్పనే సర్కారు ధ్యేయం

మౌలిక వసతుల కల్పనే సర్కారు ధ్యేయం

కథలాపూర్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరికొండలో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా  నిర్మించే డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనుల కోసం డీఎంఎఫ్‌టీ నిధులు రూ. 90 లక్షలు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీటీసీ దొప్పల హైమవతి, సర్పంచ్ గాండ్ల వీణ, ఉప సర్పంచ్ కొడిపెల్లి రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చుక్క దేవరాజం, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, నాయకులు ఇప్పల దేవదాస్, నాంపెల్లి లింబాద్రి, దొప్పల జలేంధర్, తోపారపు నర్సయ్య, వర్ధినేని నాగేశ్వర్‌రావు, శేఖర్, సునీల్, మహేశ్, వినోద్ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

అంబారిపేటలో బాస సాయిరాం అనే వ్యక్తి ఇటీవల మృతిచెందగా బాధితకుటుంబాన్ని మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి బుధవారం పరామర్శించారు.   ఆయన వెంట జడ్పీటీసీ నాగం భూమయ్య, సర్పంచ్ గోపు శ్రీనివాస్, సీహెచ్ విద్యాసాగర్‌రావు, శ్రీరాముల ప్రకాశ్, పులి గోపి, వర్ధినేని నాగేశ్వర్‌రావు, కల్లెడ శంకర్ ఉన్నారు. 


logo