బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 01, 2020 , 03:28:04

ఫేస్‌బుక్‌ మిత్రుల చేయూత

ఫేస్‌బుక్‌ మిత్రుల చేయూత

జగిత్యాల :  ఓ నిరుపేద కుటుంబ పరిస్థితిపై ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టుకు స్పందించి పలువురు అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా గన్పూర్‌ మండలం నగర్‌ గ్రామానికి చెందిన బల్లు విజయ్‌ కుమార్‌ కూరగాయలు అమ్ముతూ, భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నా డు. మే 23న విజయ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై కూరగాయల కోసం వెళ్తుండగా ట్రాలీ ఢీ కొట్టడంతో రెండు కాళ్ల ఎముకలు విరగడంతోపాటు తలకు గాయమైంది. దీంతో ఓ కాలును తొలగించగా, మరో కాలుకు సర్జరీ చేశారు. వైద్యానికి రూ.4లక్షలు ఖర్చయ్యాయి. వారికి తినేందుకు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని మిత్రుల ద్వారా తెలుసుకున్న రమేశ్‌ జూన్‌ 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, విజయ్‌ వైద్య ఖర్చుల కోసం సాయమందించాలని కోరాడు. పోస్టుకు స్పందించిన ఎన్నారైలు విజయ్‌ భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.09లక్షలు జమ చేశారు.


logo