సోమవారం 06 జూలై 2020
Jagityal - Jun 30, 2020 , 02:35:21

గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటు

గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటు

పెగడపల్లి: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశం తెలిపారు. మండలంలోని రాంభద్రునిపల్లి, నామాపూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం సోమవారం ఆయన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధిహామీ కింద ఎకరం స్థలంలో వనాలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కల పెంపకం చేపడతామన్నారు. ఇందులో వాకింగ్ ట్రాక్‌ను నిర్మించి, దాతల సహకారంతో సిమెంట్ బెంచీలు, జారుడు బల్లలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే పెగడపల్లి, నందగిరి, రాంభద్రునిపల్లి, నామాపూర్, ఎల్లాపూర్, రాజరాంపల్లి, దోమలకుంట, మద్దులపల్లి, ల్యాగలమర్రి, కీచులాటపల్లి, ఐతుపల్లి, వెంగళాయిపేట, నంచర్ల, రాములపల్లి, దేవికొండ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. మిగతా గ్రామాల్లోనూ రెవెన్యూ అధికారుల సహకారంతో స్థలాలను గుర్తించి పనులను ప్రారంభిస్తామన్నారు. ఈజీఎస్ ఏపీవో వేణు, సర్పంచులు కోరుకంటి రాజేశ్వర్‌రావు, ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హేమంత్, తిరుపతి తదితరులున్నారు.


logo