మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 28, 2020 , 02:59:05

చెక్కుల పంపిణీపైనేనా చిత్తశుద్ధి

చెక్కుల పంపిణీపైనేనా చిత్తశుద్ధి

  • హరితహారంలో ఎందుకు పాల్గొనడం లేదు
  • శ్రీధర్‌బాబను ప్రశ్నించిన టీఆర్‌ఎస్ నాయకులు 

ముత్తారం: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీపై ఉన్న చిత్తశుద్ధి హరితహారం కార్యక్రమంపై ఎందుకు లేదని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొతిపెద్ది కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన పారుపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు హరితహారం కార్యక్రమం చేపట్టి మొ క్కలను నాటుతుంటే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాత్రం  ఇప్పటివరకు ఒక్క మొక్క కూడా నాటలేదన్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్న శ్రీధర్‌బాబు, హరిత హారంలో మొక్కలను నాటకపోవడం ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అత్తె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.  logo