బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 26, 2020 , 01:50:39

హరిత తెలంగాణకు కృషి చేయాలి

హరిత తెలంగాణకు కృషి చేయాలి

  •  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

కోరుట్ల టౌన్‌: హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. పట్టణ శివారు పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఆరో విడత హరితహారాన్ని కలెక్టర్‌ గుగులోత్‌ రవి, మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో కోరుట్ల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపడమే ధ్యేయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహ్మద్‌ ఆయాజ్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఆనంద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ఎంపీపీ తోట నారాయణ, టీపీవో శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సమన్వయంతోనే విజయవంతం

రాయికల్‌ రూరల్‌: పర్యావరణ సమతుల్యతను కపాడాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేస్తేనే విజయవంతం అవుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు పేర్కొన్నారు. రాయికల్‌ పట్టణంలో గురువారం మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ఇప్పటికే స్థలాలను గుర్తించామన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో 7వ వార్డు కౌన్సిలర్‌ ఎలిగేటి లతిక అధ్యక్షతన బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, మారంపెల్లి సాయికుమార్‌, కన్నాక మహేందర్‌, తురగ శ్రీధర్‌రెడ్డి, వల్లకొండ మహేశ్‌, నాయకులు అచ్యుత్‌రావు, ఇంత్యాజ్‌, ఎలిగేటి అనిల్‌, మోర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.logo