మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 26, 2020 , 01:13:32

అట్టహాసంగా ఆరో విడుత మొదలు

అట్టహాసంగా ఆరో విడుత మొదలు

  • lఉమ్మడి జిల్లాలో పచ్చని పండుగ సందడి
  • lమొదటిరోజు మొక్కలు నాటిన మంత్రులు కొప్పుల, గంగుల 
  • lనియోజక వర్గాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు 
  • lఆనందోత్సాహాల నడుమ మమేకమైన సబ్బండవర్గాలు

కరీంనగర్‌ జిల్లాలో..

కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాపులో, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాణిపూర్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజుతో కలిసి మొక్కలు నాటారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌, పోలంపల్లి, నర్సింగాపూర్‌, గన్నేరువరం మండల కేంద్రంతోపాటు గుండ్లపల్లి, హన్మాజీపల్లి గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కలెక్టర్‌ కే శశాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. గంగాధర మండలం మధురానగర్‌లోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

పెద్దపల్లి జిల్లాలో..

రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్టీపీసీ మల్కాపూర్‌లో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, నగర మేయర్‌ బీ అనీల్‌కుమార్‌తో కలిసి మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుల్లో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి మొక్కలు నాటారు. కమాన్‌పూర్‌, రామగిరి మండలం లద్నాపూర్‌లో సైతంపాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ మినీ ట్యాంక్‌ వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మమతారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో సైతం ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి పెద్దచెరువు, ఊర చెరువుల వద్ద ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి మొక్కలు నాటారు.

జగిత్యాల జిల్లాలో..

మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌నేత ధర్మపురి పట్టణంలో మొక్కలు నాటారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని శివాలయం, కోరుట్ల పట్టణ శివారులోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల సమీపంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కలెక్టర్‌ గుగులోత్‌ రవి, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్‌ అధ్యక్షులు రాణవేని సుజాత, అన్నం లావణ్యతో కలిసి మొక్కలు నాటారు. జగిత్యాలలోని బైపాస్‌లో మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మొక్కలు నాటారు. సారంగాపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌లోని అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. కథలాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మొక్కలు నాటారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

కోనరావుపేట మండలకేంద్రంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మొక్కలు నాటారు. బోయినిపల్లి మండలం తడగొండలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వేములవాడలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి మొక్కలు నాటారు.logo