గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jun 23, 2020 , 00:35:48

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం

  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
  • చల్‌గల్‌లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

జగిత్యాల: నియోజకవర్గంలో అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌లో రజక యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గ్రామంలో నిర్మించే రజక సంఘం భవనానికి డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.2.50లక్షలు మంజూరు చేశామని తెలిపారు. భవనం పూర్తికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని చెప్పారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ.. ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ ఎంపీపీ గంగారాంగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌రావు, వైస్‌ ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌, రాయికల్‌ జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, సర్పంచ్‌ ఎల్లా గంగనర్సు, ఉప సర్పంచ్‌ పద్మ, ఏఎంసీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, నాయకులు గంగారాం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రిపై విమర్శలు సరికాదు

జగిత్యాల టౌన్‌: వరి ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అనవసర విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఏకంగా రెండు కిలోలు ఎక్కువ తూకం వేయాలని యూట్యూబ్‌లోనే పెట్టారని గుర్తు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల రూరల్‌, కొడిమ్యాల ఎంపీపీలు గాజర్ల గంగారాం, మెన్నేని స్వర్ణలత, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, అర్బన్‌ జడ్పీటీసీ సభ్యుడు మహేశ్‌ తదితరులున్నారు.


logo