శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 21, 2020 , 00:32:59

పేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’

పేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’

  • lఅర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • lరాష్ట్ర  మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేదలకు వరం లాంటిదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శనివారం కేసీక్యాంపులోని మంత్రి కార్యాలయంలో నియోజకవర్గంలోని 25 మంది లబ్ధిదారులకు 25,00,029 విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు.  అర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో మంత్రి ఈటల మొక్కలు నాటారు. త్వరలో ప్రారంభం కానున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, ఏసీపీ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌ బావుసింగ్‌, సీఐ మాధవి, ఎస్‌ఐ శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.

నియంత్రిత సాగుపై అవగాహన కల్పించాలి

నియంత్రిత పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కేసీక్యాంపులోని మంత్రి కార్యాలయంలో నియంత్రిత సాగుపై వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికతో ముందుకు సాగితే నియంత్రిత సాగు సాధ్యమవుతుందన్నారు. రైతు వేదికల నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఇప్పలనర్సింగాపూర్‌లోని జీలుగ సాగును పరిశీలించారు. ట్రాక్టరుతో జీలుగ దున్ని, వరి సాగు పనులు ప్రారంభించారు. ఆయన వెంట హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ శశాంక, డీఏవో శ్రీధర్‌, ఏడీఏ ఆదిరెడ్డి, ఏవోలు సునీల్‌ కుమార్‌, గోవర్ధన్‌ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.


logo