శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 18, 2020 , 00:37:43

అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యం

అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యం

n ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

n మూడు సీసీ రోడ్ల     నిర్మాణానికి భూమిపూజ 

n మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

జగిత్యాల: పట్టణంలో అభివృద్ధితోపాటు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 41వ వార్డులో రూ.15లక్షల ఎస్‌ఎఫ్‌సీ, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో చేపట్టిన మూడు సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు, డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. అక్రమ అనుమతులు, అక్రమ లేఅవుట్ల కారణంగా పట్టణం పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు. ప్రజలు పరిశుభ్రతకు సహకరించాలన్నారు. అధికారులు, సిబ్బంది కొరత ఉండడంతో సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ.. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్‌, పంబాల రాము, బొడ్ల జగదీశ్‌, మేక పద్మావతి, నాయకులు సతీశ్‌రాజ్‌, డిష్‌ జగన్‌, బండారు విజయ్‌, మర్రి పోచాలు, గట్టు సతీశ్‌, దావ సురేశ్‌, కత్రోజు గిరి, మల్లేశ్‌, ఆనంద్‌రావు, డీఈ లచ్చిరెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

టీఆర్‌ నగర్‌, అర్బన్‌ కాలనీకి త్వరలో మిషన్‌ భగీరథ జలాలు

మిషన్‌ భగీరథ నీటిని త్వరలో టీఆర్‌నగర్‌, అర్బన్‌ కాలనీకి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజయ్‌ తెలిపారు. చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌తో కలిసి తారకరామనగర్‌లో మిషన్‌ భగీరథ పనులను పర్యవేక్షించారు. మిష న్‌ భగీరథ నీరు అందించే క్రమంలో వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, ఇది వరకే పూర్తయిన ట్యాంకులకు నీరందించడం లాంటి అంశాలను చర్చించారు. టీఆర్‌ నగర్‌లో మూడు ట్యాంకులున్నాయని, వాటికి బల్క్‌ వాటర్‌ అందించడంతోపాటు నూతన ట్యాంక్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. నియోజకవర్గానికి సంబంధించిన నూకపెల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇండ్లకు సరైన నీటి సౌకర్యం లేదని, ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతులు ఇచ్చామన్నారు. తక్షణమే స్పందించిన వారు సమస్య పరిష్కారానికి సహకరించారని పేర్కొన్నారు. నూకపెల్లిలో నిర్మిస్తున్న ఇండ్లు పూర్తయ్యాక 30 వేల మంది నివసించే కాలనీకి మిషన్‌ భగీరథ నీరు చేరేలా త్వరలో ట్యాంకుల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. తద్వారా ఎన్నో ఏళ్ల నీటి సమస్య తీరుతుందని చెప్పారు. కౌన్సిలర్లు దేవేందర్‌నాయక్‌, చాంద్‌పాషా, ఎస్‌ఈ చంద్రమౌళి, ఈఈలు శేఖర్‌రెడ్డ్డి, శ్రీనివాస్‌, డీఈలు రామారావు, జలంధర్‌, ఏఈలు పాల్గొన్నారు. logo