ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 18, 2020 , 00:34:16

నియంత్రిత సాగుతో రైతులకు మేలు

నియంత్రిత సాగుతో రైతులకు మేలు

  • డీఏవో సురేశ్‌కుమార్‌

జగిత్యాల టౌన్‌: నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని డీఏవో సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల మండలం అంతర్గాం, చల్‌గల్‌, తాటిపల్లి గ్రామాల్లోని రైతులు గతంలో వరి సాగు చేయగా, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు బుధవారం 150 ఎకరాల్లో చెరుకు సాగుకు సిద్ధమయ్యారు. రైతుల పొలాలను సందర్శించిన వ్యవసాయాధికారి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ గ్రామాల్లో గతంలో వరి సాగు చేసిన రైతులు ఈ ఏడాది చెరుకు సాగు చేయడం అభినందనీయమన్నారు. కోరుట్ల డివిజన్‌లోని కోరుట్ల, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, రాయికల్‌ మండలాల్లో వరికి బదులు సోయాబీన్‌ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. సన్నరకం వరితోపాటు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు. 

కొడిమ్యాల: మండలంలోని పూడూర్‌ గ్రామంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనులను జిల్లా వ్యవసాయాధికారి సురేశ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. పత్తి, కంది, పెసర పంటలను పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. అంతర పంటలు సాగు చేస్తే ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరనుందన్నారు. కార్యక్రమంలో ఏవో జ్యోతి, సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ సభ్యుడు అనుమాండ్ల రఘు, రైతుబంధు కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఏఈవోలు శ్రీలత, గ్రీష్మ తదితరులున్నారు.    


logo