బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 17, 2020 , 01:49:03

కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టులో భక్తుల రద్దీ

మల్యాల : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. కరోనా నేపథ్యంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, శానిటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాకే భక్తులను ఆలయం లోనికి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo