గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jun 16, 2020 , 01:04:18

మంత్రపురిని హరితవనంగా తీర్చిదిద్దుతాం

మంత్రపురిని హరితవనంగా తీర్చిదిద్దుతాం

n ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి  n మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ

మంథని టౌన్‌: పచ్చటి చెట్లతో మంత్రపురిని హరితవనంగా తీర్చిదిద్దుతామని మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంపై ఇన్‌చార్జి కమిషనర్‌ అనుపమరావుతో కలిసి కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ఆర్పీలతో సోమవారం ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా పట్టణంలో నాటబోయే మొక్కలపై ఆమె వారితో చర్చించారు. అనంతరం పుట్ట శైలజ మా ట్లాడుతూ మంథని పట్టణంలో ఎక్కడచూసినా పచ్చటి వాతావరణం దర్శనమిచ్చేలా మొక్కలు నాటి, సంరక్షిస్తామన్నారు. ఇందు కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు నాటాలనే అంశాలపై చర్చించి నిర్ణయించి నాటుతామని పేర్కొన్నారు. మంథనిలో సింగరేణి ఆధ్వర్యంలో 60 వేల మొక్కలు నాటుతున్నారని, ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే విషయాలను తెలుసుకుని, రోడ్ల వెంట, డివైడర్ల మధ్యలో పూలమొక్కలు నాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలోని రావుల చెరువుకట్ట, పోశమ్మవాడ, పవర్‌హౌస్‌కాలనీ, గొల్లగూడెం, బోయినిపేట, గంగాపురి, అంబేద్కర్‌ చెరువుకట్ట వద్ద ము ళ్ల పొదలను తొలగించామని చెప్పారు. అక్కడ కాగితపు పూల మొక్కలు నాటించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. మంథని మున్సిపల్‌ పరిధిలోని కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమయ్యే మొక్కల వివరాలను తెలుసుకొని వారికి పంపిణీ చేయాలని సూచించారు. తమ వార్డుల్లోని మొక్కలను ఆర్పీ లు, శానిటేషన్‌ సిబ్బందితో కలిసి సంరక్షించాలని వివరించారు. కార్యక్రమంలో మున్సిఫల్‌ వైస్‌చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు, గర్రెపల్లి సత్యనారాయణ, నక్క నాగేంద్ర శంకర్‌, గుండా విజయలక్ష్మి పాపారావు, శ్రీపతి బానయ్య, కాయితీ సమ్మయ్యలతోపాటు కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీ లు, వార్డు కమిటీల సభ్యులు పాల్గొన్నారు. 


logo