మంగళవారం 27 అక్టోబర్ 2020
Jagityal - Jun 15, 2020 , 00:42:19

ఆలయాల్లో భక్తుల పూజలు

ఆలయాల్లో భక్తుల పూజలు

ధర్మపురి: ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తులు ఆదివారం పూజలు చేశారు. క్యూలైన్లో భౌతిక దూరం పాటి స్తూ, మాస్కులు ధరించి స్వామివారలను దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో దేవాలయ సిబ్బంది, పోలీస్‌ సి బ్బంది భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకున్న తర్వాత భక్తులను లోనికి అనుమతించారు. ఈనెల 8నుంచి 13వరకు 2,888 మంది భక్తులు స్వామివారలను దర్శించుకున్నట్లు, ప్రసాదాలు, ఆన్‌లైన్‌ పూజలు ద్వారా ఇప్పటి రూ.68,407  ఆదాయం సమకూరినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. 

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం తరలివచ్చారు. మాస్కులు ధరించిన భక్తులనే ఆలయంలోకి అనుమతించారు. పట్నాలు, బోనాలకు ఆలయ సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలోని చెట్ల కింద వంట చేసుకుని స్వామి వారికి నైవేద్యం పెట్టారు. ఆలయ సిబ్బంది కరోనా నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించారు. ఆలయ పరిసరాలను శుభ్రపరిచి, శానిటేషన్‌ స్ప్రే చేశారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులకు అనుమతించలేదు.


logo