గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jun 11, 2020 , 03:31:52

దుబాయిలో కథలాపూర్‌వాసి మృతి

దుబాయిలో   కథలాపూర్‌వాసి మృతి

జగిత్యాల టౌన్‌: కథలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన కల్లెడ గంగారాం (56) దుబాయిలోని దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి సభ్యులు తెలిపారు. వీరు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, కోశాధికారి దొనకంటి శ్రీనివాస్‌ తక్షణమే స్పందించి గంగా రాం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. డాక్యుమెంటేషన్‌ పూర్తి చేయించి కంపెనీ సహకారంతో మృతదేహానికి దహన సం స్కారాలు నిర్వహించారు. కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, టీఎన్‌ఆర్‌ఐ పాలసీని వెంటనే అమలు చేయాలని కోరారు.


logo