బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 10, 2020 , 02:48:08

జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

జగిత్యాల/కోరుట్ల టౌన్‌: జగిత్యాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. ఆయన తెలిపిన  ప్రకారం.. అయిలాపూర్‌కు చెందిన ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో కరోనా లక్షణాలు బయటపడడంతో వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతడి భార్యకు కూడా మంగళవారం పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ఆమెను చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75 కరోనా కేసులు నమోదయ్యాయని, వీరిలో నలుగురు డిశ్చార్జి అయ్యారని , ఇద్దరు కరోనాతో మృతి చెందారని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. మరో 69 మంది గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.


logo