మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 09, 2020 , 04:38:23

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి

  •  తెలంగాణ దార్శనికుడు సీఎం కేసీఆర్‌
  •  గ్రామ పంచాయతీలకు నెలకు 336 కోట్లు
  • రైతులు నియంత్రిత సాగుపై దృష్టి పెట్టాలి
  • సన్నరకం వరి సాగు చేయాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జగిత్యాల, నమస్తే తెలంగాణ / జగిత్యాల రూరల్‌/కోరుట్ల/కోరుట్ల టౌన్‌: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్థి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్‌లో, కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగిత్యాల నియోజకవర్గ స్థాయి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాం లో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గ్రామా ల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారన్నారు. తె లంగాణ దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని, ఆయన అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు దే శానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతి నెలా గ్రామాల అభివృద్ధికి రూ. 336 కోట్లను మంజూ రు చేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని, దీంతో పల్లెలు ఎంతో అభివృద్ధిని సాధించాయన్నారు. రైతు లు నియంత్రిత పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. మక్కకు బదులుగా పత్తి, ఆయిల్‌పామ్‌, కూరగాయలు పండించాలన్నారు. తెలంగాణ సోనాకు దేశంలోనే మంచి పేరుందని సన్నరకం బియ్యం పండించాలన్నారు. రాబోయే రోజుల్లో జగిత్యాల జిల్లాలో గోదాముల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో 25 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను 20 ఎకరాల్లో నిర్మించనుందని తెలిపారు. ప్రతి గ్రామం లో రూ. 20 లక్షలతో క్లస్టర్‌ భవనాలు నిర్మించనున్నామన్నారు. మాదాపూర్‌లో అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు, 60 వేల ఇంకుడు గుంతలకు 22 వేలు పూర్తి చేశామన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మాదాపూర్‌లో రూ.18 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి గ్రామంలోని ప్రభుత్వ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు.  

శభాష్‌ డాక్టర్‌ సాబ్‌...

ఎస్సారెస్పీ కాలువ మరమ్మతులతోపాటు, ధ రూర్‌ గ్రామ పరిధిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సైతం మంత్రి పరిశీలించారు. తొలిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినా, డాక్టర్‌ సాబ్‌ గొప్పగా పనిచేస్తున్నారంటూ మంత్రి అభినందించారు. కలెక్టర్‌ రవి సైతం అంకితభావంతో పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, కలెక్టర్‌ రవి ముందుగానే ఎస్సారెస్పీ కాలువల శుద్ధీకరణ కార్యక్రమాన్నిచేపట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. కాగా జగిత్యాల నియోజకవర్గంలోని పంచాయతీరాజ్‌ రోడ్లు, మంచినీటి సౌక ర్యం, గ్రామీణాభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తానని మంత్రి దయాకర్‌రావు హామీ ఇచ్చా రు. గతంలో పంచాయతీరాజ్‌ రోడ్లను సరిగా నిర్వహించలేదని, వాటికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి ఎమ్మెల్యే సంజయ్‌ వినతిపత్రం అందించారు. జిల్లా కలెక్టర్‌ రవితో మాట్లాడిన మంత్రి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. నూకపెల్లి శివారులో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ కాలనీకి మంచినీటి వసతి సౌకర్యం కల్పించాలని, నర్సింగాపూర్‌ శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు సంబంధించి తాగునీటి కోసం అదనంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, డీపీ వో శేఖర్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీనారాయణ, ఎంపీపీలు తోట నారాయణ, గాజర్ల గంగారాం గౌడ్‌, జడ్పీటీసీ లావణ్య, వైస్‌ ఎంపీపీ చీటి స్వరూ ప, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్‌ అధ్యక్షులు లావణ్య, సుజాత, సర్పంచులు సరోజ, దారిశెట్టి రాజేశ్‌, ఎంపీటీసీ మంగళారపు మహేశ్‌, ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, పీఏసీసీ చైర్మన్‌ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో సందీప్‌రావు, ఏపీడీ సుందరవరదరాజన్‌, మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సురేశ్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

పొలంలో సన్నాలు జల్లిన మంత్రి ఎర్రబెల్లి 

కాగా నర్సింగాపూర్‌కు వచ్చిన సమయంలో ఆ కుల రవి అనే రైతు పొలాన్ని మంత్రి దయాక ర్‌రావు పరిశీలించారు. స్వయంగా పొలంలోకి దిగి, సన్నాలను పొలంలో చల్లారు. జిల్లాలో నియంత్రిత సాగు పద్ధతికి రైతుల మద్దతు విషయాన్ని కలెక్టర్‌ రవిని అడిగి తెలుసుకున్నారు. 


logo