బుధవారం 21 అక్టోబర్ 2020
Jagityal - Jun 07, 2020 , 03:11:56

అర్బన్‌ మండల సర్వసభ్య సమావేశం వాయిదా

అర్బన్‌ మండల సర్వసభ్య సమావేశం వాయిదా

జగిత్యాల రూరల్‌: జగిత్యాల అర్బన్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం వాయిదా పడింది. కరోనా వైరస్‌ దృష్ట్యా అధికారుల సూచన మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తూ తీర్మానం చేసినట్లు ఎంపీపీ మ్యాదరి వనిత విలేకరులకు తెలిపారు. ఇటీవల జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొలుగూరి దామోదర్‌రావు, అర్బన్‌ ఎంఈవోగా ఉద్యోగ విరమణ పొందిన మద్దెల నారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూపారాణి, ప్రత్యేకాధికారి రాజేశం, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.  


logo