మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 07, 2020 , 03:10:51

పరిశుభ్రతకు శాశ్వత ప్రణాళిక

పరిశుభ్రతకు శాశ్వత ప్రణాళిక

  • గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయాలి
  • కలెక్టర్‌ గుగులోత్‌ రవి
  • రాయికల్‌లో పారిశుధ్య పనుల పరిశీలన

జగిత్యాల/రాయికల్‌ రూరల్‌/ధర్మపురి/సారంగాపూర్‌/ పెగడపల్లి: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి సూచించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా రాయికల్‌ మున్సిపాలిటీలో శనివారం చేపట్టిన పారిశుధ్య పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో మురుగునీరు నిల్వ లేకుండా ఉండడమే లక్ష్యంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

పట్టణంలో మొదటి ప్రాధాన్యత అంశాలను గుర్తించి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాయికల్‌ పట్టణం మధ్యలో నిరుపయోగంగా ఉన్న మాదిగ కుంటలో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. జిల్లాలో 3,700 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారని, వీరంతా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్‌రెడ్డి, వల్లకొండ మహేశ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులున్నారు. జగిత్యాల పట్టణంలోని 3, 8, 23, 25, 29 వార్డుల్లో చేపట్టిన పారిశుధ్య పనులను మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ..

జగిత్యాలను సంపూర్ణ ఆరోగ్య, హరిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మురుగు కాలువల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దోమల నివారణకు నీటి నిల్వల్లో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్నామని, దోమల నివారణ స్ప్రే చేశామని తెలిపారు. కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు చదువుల తిరుపతమ్మ, మల్లవ్వ, జుంబర్తి రాజుకుమార్‌, ఆరుముల్ల నర్స మ్మ, పంబాల రాంకుమార్‌, నాయకులు కోటేశ్వర్‌రావు, తిరుమలయ్య, రాజయ్య, పవన్‌, ప్రవీణ్‌, డీఈ లచ్చిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌, అశోక్‌, ఏఈ శరణ్‌తేజ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలోని ఆయా వార్డుల్లో చేపట్టిన పనులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, కమిషనర్‌ దివ్యదర్శన్‌రావు పరిశీలించారు.  సారంగాపూర్‌ మండలం భీంరెడ్డిగూడెం, మ్యాడారంతండా, నాయకపు గూడెంలలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి పరిశీలించారు. భీంరెడ్డిగూడెంలో మురుగు కాలువలు పూడికతో నిండి ఉండడంతో అసంతృప్తి వ్యక్తంజేశారు. బీర్‌పూర్‌ మండంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు మసర్తి రమేశ్‌, మనోహర్‌రెడ్డి, పాత పద్మ, సొల్లు సురేందర్‌, బల్మూరి లక్ష్మణ్‌రావు, బుచ్చిమల్లు, వరుణ్‌కుమార్‌, రాజేశ్వరి, శిల్ప, మైపాల్‌రెడ్డి, రమ, ప్రభాకర్‌, రాజన్న, రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవోలు పుల్లయ్య, మల్లారెడ్డి, ఎంపీవోలు శశికుమార్‌, వెంకటయ్య, ఏపీవో రాజేందర్‌, రైతుబంధు సమితి కన్వీనర్‌ కోల శ్రీనివాస్‌, తదితరులున్నారు. పెగడపల్లి మండలం నంచర్ల, వెంగళాయిపేట గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టగా ఎంపీపీ గోళి శోభ, ఎంపీడీవో వాసాల వెంకటేశం పరిశీలించారు. ఎంపీవో మున్వర్‌బేగ్‌, సర్పంచులు మహేందర్‌రెడ్డి, సులోచన, ఉప సర్పంచులు తిరుపతియాదవ్‌, మధూకర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo