ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 05, 2020 , 07:23:30

‘ఉపాధి’ పనుల్లో సర్పంచ్‌

‘ఉపాధి’ పనుల్లో సర్పంచ్‌

గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌ సైతం ఉపాధిహామీ కూలీగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం చింతకుంట సర్పంచ్‌ భైర హేమలత వారం రోజులుగా మట్టిరోడ్డు నిర్మాణ పనులకు వెళ్తున్నారు. ఇంట్లోఖాళీగా కూర్చోలేక ఉపాధిహామీ పనులకు వెళ్తున్నట్లు సర్పంచ్‌ చెబుతున్నారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారితో కలిసి సమానంగా పనులు చేస్తుండడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.   

-కథలాపూర్‌


logo