సోమవారం 06 జూలై 2020
Jagityal - Jun 03, 2020 , 04:30:20

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

  సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

మల్లాపూర్‌: మండలంలోని రత్నాపూర్‌ గ్రామంలోని పంచాయతీ పాలకవర్గం, గ్రామ సర్పంచ్‌ మేడి అనూష ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ కేవలం ఆరేండ్లలో అరవై ఏండ్లలో జరిగే అభివృద్ధిని చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు రుణపడి ఉంటామన్నారు. ఇక్కడ ఉప సర్పంచ్‌ లయ, కార్యదర్శి నవీన్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, నాయకులు మేడి వినోద్‌, లింగన్న, పాల్గొన్నారు. 


logo