శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - May 31, 2020 , 03:59:57

పంట మార్పిడి చేయాలి

పంట మార్పిడి చేయాలి

కొడిమ్యాల: రైతులు పంటమార్పిడి చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచించారు. మండలంలోని నల్లగొండ, తిర్మలాపూర్‌ గ్రామాల్లో శనివారం నిర్వహించిన నియంత్రిత పంటల సాగు సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పంటల మార్పిడి విధానంతో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి వాడాలన్నారు. సన్నరకం వడ్లు పండించాలన్నారు. రాష్ట్రంలో రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయాధికారులు సూచించిన పంటలు సాగు చేయాలన్నారు. కాళేశ్వరం జలాలతో గ్రామ గ్రామాన మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని వాటర్‌ హబ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. అనంతరం వరి పంట కాకుండా వివిధ రకాల పంటలు వేస్తామని రైతులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పారిశు ధ్య కార్యక్రమ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. జూన్‌1 నుంచి 8వరకు నిర్వహించనున్న పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్‌ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్‌, సింగి ల్‌ విండో చైర్మన్లు మేనేని రాజనర్సింగరావు, బండ రవీందర్‌రెడ్డి, పోలు రాజేందర్‌, సర్పంచులు మల్లేశం, పద్మ, కృష్ణారావు, లత, నర్సయ్య, స్వామిరెడ్డి, ఎంపీటీసీలు సింధు, రాఘవరెడ్డి, మల్లారెడ్డి, ఎంపీడీవో రమేశ్‌, ఏవో సంధ్య, సావనపల్లి రమేశ్‌, చీకట్ల మహేందర్‌గౌడ్‌, మ్యాకల మల్లేశం,గంగుల మల్లేశం ఉన్నారు.  logo