మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - May 27, 2020 , 02:52:18

కొనసాగుతున్న కాలువ మరమ్మతులు

కొనసాగుతున్న కాలువ మరమ్మతులు

ధర్మపురి : నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈ శ్వర్‌ ప్రత్యేక చొరవతో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపతున్న ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులు ఈనెల 18న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  పను ల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని 107 గ్రామాల్లో 8846 మంది కూలీలతో 31.8 కిలోమీటర్ల దూరం కాలువల పూడికతీత పనులు జరిగాయని అధికారులు వెల్లడించారు.

పనుల వివరాలు .. 

ధర్మపురి మండలంలోని 18 గ్రామాల్లో 2000 మంది ఉపాధి కూలీలు పనులకు హాజరై 1.2కిలో మీటర్ల దూరం కాలువల్లో పూడికతీత పనులతో పాటు కాలువ గట్టున పొదలు, పిచ్చిచెట్లను తొలగించారు. బుగ్గారం మండలంలోని 11 గ్రామా ల్లో 1450 మంది ఉపాధి కూలీలు1కిలోమీటరు పొడవు కాలువలను శుభ్రం చేశారు. వెల్గటూర్‌ మండలంలోని 23గ్రామాల్లో 2600 మంది కూలీలు 18 కిలోమీటర్ల పొడవు కాలువల్లో పూడికతీత పనులు చేశారు. పెగడపల్లి మండలంలోని 13గ్రామాల్లో 635 మంది ఉపాధి కూలీలు హాజరై 6.5కిలోమీటర్ల దూరం కాలువల్లో పూడిక తీశారు. గొల్లపెల్లి మండలంలోని 25 గ్రామాల్లో 1261 మంది కూలీలు హాజరై కిలోమీటర్‌ దూరం కాలువల్లో పూడిక తీశారు. అలాగే ధర్మారం మండలంలోని 17గ్రామాల్లో 900 మంది కూలీలు హాజరై 4.1కిలోమీటర్ల దూరం కాలువల్లో పూడికతీత పనులు చేశారు. ఈ పనులను ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పర్యవేక్షించారు..logo