శనివారం 06 జూన్ 2020
Jagityal - May 24, 2020 , 00:35:07

రైతులు ఆర్థికంగా ఎదగాలి

రైతులు ఆర్థికంగా ఎదగాలి

నియంత్రిత సేద్యం చేపట్టి లాభాల బాట పట్టాలి

రైతు దశ మార్చడమే కేసీఆర్‌ లక్ష్యం 

రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారంలో ఎస్సారెస్పీ కెనాళ్లలో పూడికతీత పనుల పరిశీలన

ధర్మారం: రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి, ముందుగా నందిమేడారంలోని ఎస్సారెస్పీ డీ83/బీ 5ఆర్‌ కెనాల్‌, ఖిలావనపర్తిలోని 11ఎల్‌, నర్సింహులపల్లిలో 1ఆర్‌ కెనాళ్లలో ‘జలహితం’ కింద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. పనులు వేగంగా జరుగుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కెనాళ్లకు పుష్పాభిషేకం చేశారు. ఉపాధి కూలీలకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీఓ రవిని ఆదేశించారు. అలాగే సీఎం కేసీఆర్‌ చేపట్టిన నియంత్రిత సాగు విధానాన్ని స్వాగతిస్తూ నర్సింహులపల్లిలో కానంపల్లి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి రైతులు ప్రతిజ్ఞ చేయగా, ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జెండా గద్దె వద్దకు వెళ్లి గులాబీ జెండాను ఎగరేశారు. రైతులు ఆయనకు నాగలి బహూకరించారు. ధర్మారం జీపీ కార్యాలయం వద్ద ఆశ్రయ్‌ ఆకృతి స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో 121 మంది దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రైతు దశ మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అనేక పథకాలకుతోడు ప్రాజెక్టులు నిర్మించి పుష్కలంగా నీరందిస్తున్నదని చెప్పారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ఈ వానకాలం నుంచి నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుడుతున్నదని తెలిపారు. పంట మార్పిడితో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని, సీఎం కేసీఆర్‌ పిలుపునందుకొని ఇవ్వాళ కొత్త విధానానికి కట్టుబడి ఉంటామని నర్సింహులపల్లి, కానంపల్లి, బుచ్చయ్యపల్లి రైతులు స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం నందిమేడారంలో విద్యుత్‌ షాక్‌తో గాయపడి చికిత్స పొందుతున్న కొమ్మ హరీశ్‌ను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని, తనతోపాటు పార్టీ తరఫున రూ.50 వేల నగదు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ధర్మారంలో సంజీవని దవాఖాన యజమాని ఎండీ హఫీజ్‌, డాక్టర్‌ కే ప్రశాంత్‌ సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లను ఆటో డ్రైవర్లకు మంత్రి అందజేశారు. అనంతరం ధర్మారం మండల ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌గా ఖిలావనపర్తికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు  పాకాల రాజయ్య, ఆర్‌బీఎస్‌ జిల్లా సభ్యులుగా ధర్మారానికి చెందిన పూస్కూరు రామారావు, కొత్తపల్లికి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని మంత్రి నియమించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరుణశ్రీ, జడ్పీటీసీ పద్మజ, ఏఎంసీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, పీఏసీసీ చైర్మన్లు బలరాంరెడ్డి, వెంకట రెడ్డి, సర్పంచులు జితేందర్‌రావు, జానకి, సుజాత, అరుణజ్యోతి, మనీషా, కొమురయ్య, ఎంపీటీసీలు రాంబాబు, సరోజ, తిరుపతి, సుజాత, సదయ్య, జడ్పీ, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ సలామొద్దీన్‌, ఎండీ రఫీ, దివ్యాంగుల జిల్లా అధికారి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజేశ్‌, తహసీల్దార్‌ సంపత్‌, ఎంపీడీఓ బాలరాజు, ఎంపీఓ శంకరయ్య పాల్గొన్నారు.logo