మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - May 17, 2020 , 02:18:36

మీ సేవలకు వందనం..

మీ సేవలకు వందనం..

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/మంథని టౌన్‌ : విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి ప నిచేస్తున్న వైద్య, పోలీసు, పారిశుధ్య సిబ్బంది సేవ లు వెలకట్టలేనివని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ అభివర్ణించారు. మంథని జూ నియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్‌ మధు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ‘మీ సేవలకు మా సత్కారం’తోపాటు మెగా రక్తదాన శిబిరానికి మం త్రి హాజరయ్యారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, బల్ది యా చైర్‌పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి  మండలాలకు చెందిన 930 మంది పోలీసు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి కొత్త బట్టలు పెట్టారు. నెత్తిన పూలు చల్లి చేతులెత్తి నమస్కరించి సన్మానించారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ పోలీసులు, హెల్త్‌, పారిశుధ్య సిబ్బంది నిరంతర శ్రమతోనే జిల్లా గ్రీన్‌ జో న్‌లో ఉందని, వీరి సేవలకు గుర్తింపుగా పుట్ట మ ధు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలామంది దగ్గర డబ్బు ఉం టుంది కానీ, సేవ చేసే గుణం, ధైర్యం తక్కువ మందికే ఉంటుందని, అందులో పుట్ట మధు ముందుంటారని కొనియాడారు. కష్టకాలంలో మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్క రూ సాటి మనిషిని ఆదుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ముందుజాగ్రత్త చర్యలతోనే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 

సేవలకు గుర్తింపుగానే సత్కారం’: పుట్ట మధూకర్‌

వైద్య, పారిశుధ్య, పోలీస్‌ సిబ్బంది సేవలకు గుర్తింపుగానే పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తెలిపారు. మరో కార్యక్రమం ద్వారా కరోనా కట్టడిలో భాగస్వామ్యమవుతున్న రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖల సిబ్బంది, జర్నలిస్టులను కూడా సత్కరించబోతున్నట్లు ప్రకటించారు.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. 

తలసేమియా రోగులను ఆదుకోవాలనే మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు పుట్ట లింగమ్మ ట్రస్టు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో పుట్ట మధూకర్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పం దన వచ్చింది. మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి మండలాలకు చెందిన 360 మంది రక్తదానం చేశారు. శిబిరాన్ని మంత్రి కొప్పుల, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, సీపీ సత్యనారాయణ, డీసీపీలు రవీందర్‌, రవికుమార్‌, ఏసీపీ ఉమేందర్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌, డీసీహెచ్‌ఎస్‌ వాసుదేవరెడ్డి తదితరులు సందర్శించారు. రక్తదాతలతోపాటు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను మంత్రి కొప్పుల అభినందించారు.

‘సల్లగ ఉండు బిడ్డా..’ 

‘మీ సేవలకు మా సత్కారం’లో భాగంగా ఉ ద్యోగులకు సన్మాన కార్యక్రమం జరుగుతుండగా, మంథని మండలం మల్లెపల్లికి చెందిన రాజమల్లక్క బిస్కెట్‌ ప్యాకెట్‌తో వేదిక వద్దకు వచ్చింది. గమనించిన మంత్రి కొప్పుల ‘ఏం కావాలమ్మా అని’ అడుగగా పుట్ట మధు ఎక్కడ అని అడిగింది. మంత్రి ఈశ్వర్‌ మధును పిలువగా, అక్కడకు వచ్చి మల్లక్క చేతిలో ఉన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ చూసి ‘ఏందమ్మా.. ఎందుకు ఇది అని మధు అడిగారు. నీ పుట్టిన రోజు కదా కొడుకా.. ఇది నా బహుమతి అంటూ చేతిలో పెట్టి, సల్లంగ బతుకు బిడ్డా అంటూ దీవించి వెనుదిరిగింది.logo