సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - May 16, 2020 , 03:14:36

ఆరోగ్య రక్షణ.. బల్దియా బాధ్యత

ఆరోగ్య రక్షణ.. బల్దియా బాధ్యత

కార్పొరేషన్‌ : నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ బల్దియా బాధ్యత అని నగర మేయర్‌ వై సునీల్‌రావు భరోసా ఇచ్చారు. నగరంలోని 35వ డివిజన్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34, 35, 36వ డివిజన్లలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని మేయర్‌ పరిశీలించి, కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

డ్రైనేజీల్లో చెత్త లేకుండా చేస్తాం

కరీంనగర్‌లోని ప్రధాన మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగిస్తామని మేయర్‌ తెలిపారు. నగరంలో రూ.38 లక్షల  వ్యయంతో చెత్త తొలగింపు పనులను స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న మురుగుకాలువ వద్ద ఆయన ప్రారంభించారు. చెత్త తొలగింపు పనులను ప్రతిరోజూ ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. బల్దియా కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు జితేందర్‌, రమణారావు, బుచ్చిరెడ్డి, తదితరులున్నారు.logo