ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - May 12, 2020 , 01:41:18

భూసారాన్ని పెంపొందించుకోవాలి

భూసారాన్ని పెంపొందించుకోవాలి

  • ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ 
  • సబ్సిడీ విత్తనాల పంపిణీ ప్రారంభం 

జగిత్యాల రూరల్‌ : దిగుబడి పెరగాలంటే భూసారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్యే సంజయ్‌ పేర్కొన్నారు. జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.30లక్షల విలువైన విత్తనాలను రైతులకు 60శాతం సబ్సిడీపై అందిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పటికే భూగర్భ జలాలు పెరిగాయని, రైతులు అంచనాలకు మించి పంట సాగు చేశారని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, సహకార సంఘం సీఈవో గాజంగి వేణు, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌, నాయకులు దామోదర్‌ రావు, దావ సురేశ్‌, రవీందర్‌ రెడ్డి, అల్లాల ఆనంద రావు, బండారి విజయ్‌ పాల్గొన్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పొలాస వ్యవసాయ కళాశాల ఏడీఆర్‌ ఉమారెడ్డి బతుకమ్మ జీలుగ విత్తనాలను 30మంది రైతులకు పంపిణీ చేశారు. సర్పంచ్‌ చెరుకు జాన్‌, సొసైటీ చైర్మన్‌ పన్నాల తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు చిన్న గంగయ్య, రత్నాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. logo