సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - May 10, 2020 , 02:39:24

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ :  ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. క్యాంపు కా ర్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగిలో 2.47లక్షల ఎకరాల్లో పంటలు పం డి గతం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింద ని చెప్పారు. 380 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభు త్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందని, అయినా ధాన్యాన్ని మిల్లర్లు రైస్‌మిల్లుల్లో అన్‌లోడ్‌ చేసేందుకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాలు, తప్ప పేరిట తరు గు తీస్తూనే లారీల్లో ధాన్యం ఎక్కించిన త ర్వాత రవాణా చార్జీల పేరిట బస్తాకు రూపాయి నుంచి రూ.3 వరకు వసూలు చేస్తున్నారన్నారు. దీంతో రైతులు ఇబ్బం ది పడుతున్నారని, హమాలీలు లేరంటూ రోజుల తరబడి లారీలను ఆపడం వల్ల ఇక్కట్లు తప్పడం లేదని ఈ విషయంలో డీసీవో, పౌరసరఫరాల శాఖ డీఎం, అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమాచారం ఇచ్చామన్నారు. రైతులకు సమస్యలుంటే తనకు సమాచారమందించాలని సూచించారు. ఆయన వెంట జగిత్యాల రూరల్‌ ఎంపీపీ గంగా రాం గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, సందీప్‌రావు, దామోదర్‌ రావు, రవీందర్‌ రెడ్డి ఉన్నారు.  


logo