సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - May 10, 2020 , 02:39:27

గాలివాన బీభత్సం..

గాలివాన బీభత్సం..

  • జగిత్యాల జిల్లాలో తీవ్ర ప్రభావం
  • తడిసిన ధాన్యం, రాలిన మామిడి
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • పదుల సంఖ్యలో ఇండ్లకు నష్టం

జగిత్యాల టౌన్‌/జగిత్యాల రూరల్‌/కోరుట్ల/మల్లాపూర్‌/సారంగాపూర్‌/రాయికల్‌/ధర్మపురి/పెగడపల్లి: జగిత్యాల జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వానతో 18 మండలాల్లో 15వేల క్విం టాళ్ల వడ్లతో పాటు పలు చోట్ల పసుపు, మక్క దిగుబడులు తడిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నా రు. సుమారు 5వేల ఎకరాల మామిడి తోటల్లో కాయలు నేలరాలినట్లు ఉద్యానవన శాఖ అధికారు లు తెలిపారు. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల షెడ్లు, భారీ హోర్డింగ్‌లు కూలిపోయాయి. కోరుట్ల మండలం మాదాపూర్‌ శివారులో విఘ్నేశ్వర పారాబాయిల్డ్‌ రైస్‌మిల్‌ గోదాము కూలిపోయి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. రైస్‌మిల్లును అదనపు కలెక్టర్‌ రాజేశం రాత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నా రు. రాయికల్‌ మండలం మంక్త్యానాయక్‌ తండాలో ఐదు ఇండ్లు పూర్తిగా, పది ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జగిత్యాల రూరల్‌, అర్బన్‌, సారంగాపూర్‌, మల్లాపూర్‌, పెగడపల్లి, ధర్మపురి మండలాల్లో ధా న్యం తడిసిపోయింది. పెద్దనక్కలపేటలో చెట్లు నేలకూలి రెండు గొర్రెలు చనిపోయాయి. 

 పెద్దపల్లి జిల్లాలో

ధర్మారం/మంథనిటౌన్‌/పాలకుర్తి: పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లోనూ గాలివాన ప్రభావం కనిపించింది. ధర్మారం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో కొంత మేర ధాన్యం తడిసింది. మల్లన్న గుట్ట దారిలో ఆలయ స్వాగత తోరణం కూలింది. పలు గ్రామాల్లోని తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మంథని, పాలకుర్తి మండలాల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. 


logo