ఆదివారం 05 జూలై 2020
Jagityal - May 06, 2020 , 01:54:37

దేశానికే ఆదర్శం

దేశానికే ఆదర్శం

  • ఎమ్మెల్యే సుంకె 

చొప్పదండి, నమస్తేతెలంగాణ/ గంగాధర : నిరుపేద ఆడబిడ్డలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ప్రవేశపెట్టిందని, ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని ఎమ్మెల్యే క్వార్టర్‌లో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు 8 లక్షల 928ల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గంగాధరలో ఏయిమ్‌ ఏషియా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 150 మంది క్రైస్తవులకు రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌లూక్‌తో కలిసి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు చిలుక రవి, మధుకర్‌, జడ్పీటీసీ అనురాధ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్‌ మహిపాల్‌రావు, విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, బాలగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.logo