సోమవారం 25 మే 2020
Jagityal - Apr 10, 2020 , 02:12:17

సేవామూర్తులు

సేవామూర్తులు

  • ఆపత్కాలంలో పేదలు, కూలీలకు తమ వంతు సాయం

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలను సేవామూర్తులు అక్కున చేర్చుకుంటున్నారు. తమకు తోచిన సాయం చేస్తూ, ఆపత్కాలంలో అండగా నిలబడుతున్నారు. కొందరు నిత్యావసరాలు అందిస్తుండగా, మరికొందరు కడుపునిండా భోజనం పెడుతున్నారు. 

చొప్పదండి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌హెల్త్‌/తెలంగాణచౌక్‌/ గంగాధర/ మానకొండూర్‌/శంకరపట్నం/ హుజూరాబాద్‌టౌన్‌/ కరీంనగర్‌ క్రైం: నగరంలో 150 మంది సిబ్బందికి ‘మేమున్నాం మీ కోసం’ సంస్థ అధ్యక్షుడు నగునూరి రాజేందర్‌ ఆహారం అందజేశారు. శ్రీ సేవా మార్గ్‌ బాధ్యురాలు మునిపల్లి ఫణీత పేదలకు భోజనం పెట్టారు. సభ్యులు కిరణ్‌, సందీప్‌, రవీందర్‌రెడ్డి, భాస్కర్‌, అంజయ్య పాల్గొన్నారు. రోహన్‌ హాస్పిటల్‌ వైద్యులు ఎనమల్ల నరేశ్‌, శ్రీదేవి కార్పొరేటర్‌ అర్ష కిరణ్మయి మల్లేశం, మేయర్‌ సునీల్‌రావు చేతుల మీదుగా పేదలకు సరుకులు పంపిణీ చేశారు. కెనెరా బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు భోజనం అందజేశారు. 39వ డివిజన్‌లోని నిరుపేద కూలీలకు గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థాన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాల్తెపు లింగమూర్తి ఆధ్వర్యంలో వంటసామగ్రి అందించారు. 50లీటర్ల శానిటైజర్‌, ఫేస్‌ మాస్క్‌లు, డిస్పోజల్‌ గ్లౌజులను తారానాథ్‌ సైంటిఫిక్‌ సర్జికల్‌ అధినేత శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌కు అందజేశారు. మహీంద్ర మోటార్‌లైన్‌ సంస్థ డైరెక్టర్‌ సునీల్‌ కోకిలవాణి సూచన మేరకు బ్రాంచ్‌ మేనేజర్‌ వడ్లూరి రాజు శానిటైజర్లను సీపీకి అందించారు. హుజూరాబాద్‌ 7వ వార్డు పరిధిలోని 120 నిరుపేద దళిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున 30 క్వింటాళ్ల బియ్యాన్ని వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల- శ్రీనివాస్‌ దంపతులు ఆమె కొడుకు అజయ్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నేతలు దశరథం, సత్యం, రాకేశ్‌ ఉన్నారు. టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు పోతిరెడ్డి హరీశ్‌రావు దుద్దనపల్లిలో 30మంది నిరుపేదలకు నిత్యావసరాలను ఎస్‌ఐ ప్రశాంతరావు, ఎంపీడీవో పద్మావతి చేతుల మీదుగా అందించారు. సర్పంచ్‌ తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య ఉన్నారు. దుద్దనపల్లిలో పంచాయతీ కార్మికులను పురోహితుడు పరాంకుశం అనంత్‌కుమార్‌ సన్మానించి ఒక్కొక్కరికి వెయ్యి చెక్కును అందజేశారు. చొప్పదండిలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కాంగ్రెస్‌ నేత మేడిపల్లి సత్యం 10 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కోట్లనర్సింహులపల్లిలో చిదురు సతీశ్‌ తన కొడుకు హర్షల్‌ బర్త్‌డే సందర్భంగా 45మంది పేదలకు 11వేల నిత్యావసరాలను సర్పంచ్‌ కవితతో కలిసి అందజేశారు. ర్యాలపల్లి, చెర్లపల్లి(ఆర్‌), కొండాయపల్లి, కుర్మపల్లి గ్రామస్తులకు ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి 400 మాస్కులు పంపిణీ చేశారు. ఉప్పరమల్యాలలో సర్పంచ్‌ మంజుల, ఎంపీటీసీ జమున పారిశుధ్య కార్మికులకు 50 కేజీల చొప్పున బియ్యం అందించారు. గంగాధరలో సర్పంచ్‌ గంగాధర్‌ జీపీ సిబ్బంది, ఆశ కార్యకర్తలకు నిత్యావసరాలు పంపి ణీ చేశారు. కాసారంలో పారిశుధ్య కార్మికులకు షూ లు, గ్లౌజులు, మాస్కులను సర్పంచ్‌ దామోదర్‌ అందజేశారు. కురిక్యాలలో సర్పంచ్‌ నవీన్‌రావు ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మానకొండూర్‌లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా పాత్రికేయులకు బీజేపీ నేతలు శానిటైజర్స్‌, మాస్కులు, గ్లూకోన్‌డీ, డెటాల్‌ సబ్బులను అందజేశారు. చింతలపల్లిలో బీజేపీ నాయకుడు కేశవేని అశోక్‌ పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా..

సిరిసిల్ల రూరల్‌/సిరిసిల్ల టౌన్‌/చందుర్తి/ బోయినపల్లి/ ఎల్లారెడ్డిపేట/ ఇల్లంతకుంట :  తంగళ్లపల్లి మండలంలోని 30 గ్రామాల్లో గల 151 గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్కొక్కరికి 500 చొప్పున 75,500ను అందజేసేందుకు సెస్‌ చైర్మన్‌ దోర్నా ల లక్ష్మారెడ్డి ముందుకు వచ్చారు. సదరు నగదును తంగళ్లపల్లి ఎంపీడీవో చికోటి మదన్‌మోహన్‌, ఎంపీపీ పడిగెల మానసకు అందజేశారు. జిల్లా పోలీసుల కోసం 700 ఎన్‌95 మాస్క్‌లు, 200 లీటర్ల శానిటైజర్‌, 500 సోప్‌లను తాడూరు శివారులోని జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు కోవిద సహృదయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ అనూహ్యరెడ్డి, సభ్యులు అందజేశారు. సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లోని సీఐ వెంకటనర్సయ్య, ఎస్‌ఐలకు, సిబ్బందికి ప్రముఖ న్యాయవాది, పీపీ బొంపెల్లి రవీందర్‌రావు శానిటైజర్లను అందజేశారు. సిరిసిల్లలోని 37వ వార్డులో కౌన్సిలర్‌ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, ఉపాధ్యక్షుడు మంచె శ్రీనివాస్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌ పంపిణీ చేశారు. సిరిసిల్లలోని సాహితీ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులు (1999-2000 పదో తరగతి బ్యాచ్‌) పేదలకు నిత్యావసర సరుకులు, సిరిసిల్ల హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భోజనం అందజేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ స్వగ్రామం కొదురుపాకలో రెండో రోజూ వలస కార్మికులకు మాజీ ఎంపీటీసీ, టీఆర్‌ఎస్‌ నాయకులు, బొల్లవేణి వాణిశ్రీ, తిరుపతియాదవ్‌ దంపతులు అన్నదానం చేశారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కత్తెరపాక కొండయ్య పాల్గొన్నారు. రామారావుపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోరె పరుశరాములు పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమకు వచ్చిన రేషన్‌ బియ్యాన్ని గుండారం సర్పంచ్‌ భూక్యా శంకర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ సిద్దాల బాలయ్య చెరో 48 కిలోలు పేదలకు అందజేశారు. గొల్లపల్లిలో పందిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ 12 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. కరోనా నివారణకు తనవంతుగా సాయంగా 5 వేల చెక్కును కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు అందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఇల్లంతకుంట మండలం మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి అందజేశారు. తంగళ్లపల్లి జడ్పీటీసీ పుర్మాణి మంజుల-రాంలింగారెడ్డి దంపతులు దేశాయిపల్లె, మల్లాపూర్‌, లక్ష్మీపూర్‌లోని వంద మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. తంగళ్లపల్లిలోని మోర శ్రీహరి వస్త్ర పరిశ్రమ యజమాని తన వద్ద పనిచేస్తున్న 40 మంది కార్మికులకు 500తో పాటు నిత్యావసర సరుకులను చేనేత జౌళిశాఖ ఏడీ అశోక్‌రావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. లక్ష్మీపూర్‌, జిల్లెల్ల, తంగళ్లపల్లితో పాటు పలు కొనుగోలు కేంద్రాల్లో హమాలీలకు, కూలీలకు నరేన్‌ ఫౌండేషన్‌ సభ్యులు దస్తీలను అందజేశారు. మండెపల్లిలోని కొనుగోలు కేంద్రంలో సర్పంచ్‌ గనప శివజ్యోతి హమాలీలకు మాస్కులను అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేట శివారులోని ఇటుక బట్టీల్లోని కార్మికులకు విద్యార్థి ప్రజ్ఞ స్వచ్ఛంద సంస్థ సభ్యులు 5.90క్వింటాళ్ల బియ్యం, 150 ప్యాకెట్ల నిత్యావసర సరుకులను సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ చేతులమీదుగా పంపిణీ చేశా రు. సీఐ వెంకటనర్సయ్య, కౌన్సిలర్‌ పాతూరి రాజిరెడ్డి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


logo