ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Mar 10, 2020 , 02:08:10

కమనీయం తెప్పోత్సవం..

కమనీయం తెప్పోత్సవం..

ధర్మపురి,నమస్తేతెలంగాణ:  అఖిలాండకోటి బ్ర హ్మాండ నాయకుడు.. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. నాల్గోరోజైన సోమవారం భక్తులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నా నాలు చేసి స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  యాజ్ఞాచార్యులు, కందాళై పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో ఆస్థాన  వేదపండితులు ముత్యాల శర్మ, వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం నిర్వహించారు. 

  తెప్పోత్సవం, డోలోత్సవం..

ధర్మపురి శ్రీలక్ష్మినరసింహస్వామి(యోగ)వారి తె ప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు సోమవా రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెప్సోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణి(కోనేరు)కి రంగులు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకరించా రు. ఆలయం నుంచి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను కోనేరు వరకూ ఊరేగింపుగా తీసుకొ చ్చి అ లంకరించిన హంసవాహనంలో ఉంచి కోనేరులో ఐదు ప్రదక్షిణలు చేశారు.  గోవిందనామ స్మరణలతో భక్తులు పసుపు కుంకుమ చల్లి మొక్కుకున్నా రు.  అనంతరం కోనేరు మధ్యలోని మండపంలో ఉత్సవ మూర్తులకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాత్రి 9గంటల వరకూ కొనసాగ గా. భక్తులు క్యూలైన్లో స్వామివార్లను దర్శించుకున్నారు. నిర్మల్‌, నిజమాబాద్‌, బైంసా, ఊట్నూర్‌ నుంచి వచ్చిన భక్తుల పాటలు, ధర్మపురి మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.

వేడుకలకు అన్ని ఏర్పాట్లు: మంత్రి 

 బహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి           కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. డోలోత్సవంలో పా ల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ దాదాపు రెండు మాసాల నుంచి దేవస్థాన సిబ్బందితో పాటు వివి ధ శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేశామని తెలిపారు. భక్తులు  ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలన్నారు. లక్ష్మీనరసింహస్వామి కృప ప్రతి ఒ క్కరిపై ఉంటుందన్నారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఘన స్వాగతం పలికారు.   కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంగి సత్తెమ్మ, నాయకులు బాదినేని రాజేందర్‌, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, అయ్యోరి రాజేశ్‌కుమార్‌, ఎడ్ల చిట్టిబాబు, అక్కనపల్లి సునీల్‌ కుమార్‌, ఇనుగంటి వినోద్‌రావ్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్‌, సంగి శేఖర్‌, మురికి శ్రీనివాస్‌  ఉన్నారు. 

భక్తులకు అన్నదానం..

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పాతటీటీడీ కల్యాణ మండపంలో ఆలయం పక్షా న రై స్‌మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో నిర్వహిస్తు న్న అన్నదానలో సోమవారం దాదాపు 12వేల మంది భక్తులు పాల్గొన్నారు.  పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆర్యవైశ్య మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందించారు. 

బ్రహ్మోత్సవాల్లో నేడు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కోనేరు లో లక్ష్మీనరసింహస్వామివారి(ఉగ్ర) తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రామాలు నిర్వహించనున్నారు.

స్వామివారి సన్నిధిలో మంత్రి ఈశ్వర్‌ పూజలు

 ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో సోమవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచన మండపంలో స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు తదితరులున్నారు.

ఘనంగా తెప్పోత్సవం

జగిత్యాల టౌన్‌ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం లోని అష్టలక్ష్మి ఆలయ ఆవరణలోని మోతె చెరువులో రాత్రి తెప్పోత్సవం కార్యక్రమాన్ని నంబి వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్య క్రమంలో అర్చకులు అనంత శయానాచార్య, జగన్‌మోహనాచార్య, నంబి చిన్నస్వామి, ప్రకాశ్‌ స్వామి, వంశి స్వామి, అభిషేక్‌స్వామి, గరిపెల్లి శంకర్‌, శమంత, శశికుమార్‌, వందన, శ్రీవన్శ్‌, రాంచంద్రం పాల్గొన్నారు

సంప్రదాయ సంగీతాన్ని పరిరక్షించాలి డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి..

 సంప్రదాయ సంగీతాన్ని పరిరక్షించాలని డీసీఎ మ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధర్మపురి లక్ష్మీనర సింహస్వామివారి ఆలయంలోని శేషప్ప కళావేది కపై సోమవారం నిర్వహించిన సంస్కృతిక కార్య క్రమాలు అలరించాయి. మధ్యాహ్నం స్థానిక లక్ష్మీనరసింహ నాట్య మండలి ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారం భమయ్యా యి. ఈ సంధర్బంగా పాల్గొన్న శ్రీకాంత్‌రెడ్డి మా ట్లాడుతూ లక్ష్మీనరసింహనాట్య కళామండలి ఆధ్వ ర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు కొనసా గించడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా తాగ్యరాజ ఘన పంచరత్న మాలికలను ధర్మపు రికి చెందిన నరహరి, రేవతి, అనుపమ, శ్వేతలు గానం చేశారు. స్థానిక అపర త్యాగరాజగా ఘనతి కెక్కిన త్యాగయ్య, చాగం కిష్టయ్య చిత్రపటాలను పట్టు కొని శేషప్ప కళావేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా దేవస్థానం సంకీర్తన, శేషప్ప కళావేధిక పూజ నిర్వహించిన అనంతరం త్యాగ రాజ ఆరా ధనోత్సవాలు ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో సంగనబట్ల నర్సయ్య తదితరులున్నారు.


logo